Priyanka Jawalkar: సినిమాలు ల్లేవు.. ఫోటోలతో జవాల్కర్ షో!

ఫోటోలతో జవాల్కర్ షో!;

Update: 2025-06-26 02:34 GMT

Priyanka Jawalkar: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా సినిమాతో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ ప్రియాంక జవాల్కర్. ఈ మూవీలో మైండ్ బ్లోయింగ్ లుక్స్, అందంతో కుర్రాళ్లను మెస్మరైజ్ చేసింది. ఆతర్వాత గమనం, ఎస్ఆర్ కల్యాణ మండపం, తిమ్మరుసు చిత్రాల్లోనూ మెప్పించింది ఈ చిన్నది.. అక్కడ ఆమె పాత్రలకూ మంచి ప్రశంసలు దక్కాయి. చాలాకాలం తర్వాత టిల్లు స్క్వేర్ తో యూత్ ను బాగా ఆకట్టుకుంది. చివరిసారిగా మ్యాడ్ స్క్వేర్లో కనిపించిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం మూవీ ఆఫర్ల కోసం వేచి చూస్తోంది. అయితే సినిమాల సంగతి ఎలా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడు యాక్టీవ్ గానే ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈభామ ఇన్ స్టాలో షేర్ చేసిన పిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇందులో ఈ అమ్మడు బ్లాక్స్, ఈ లన్సింబల్ లాకెట్టు, సింపులేమేకప్, ఉంగరాల జుట్టుతో సహజంగా, అందంగా కనిపించింది. ఈ పోస్టుకు 'మీరిచ్చే ప్రతి కామెంట్ చదువుతా' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఈ అమ్మడి గ్లామరస్ ఫొటోలపై నెటిజన్స్ లైకుల వర్షం కురిపిస్తూ.. క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News