OG 16 Days Collections: ఓజీ 16 రోజుల కలెక్షన్లు ఎన్ని కోట్లంటే.?

ఎన్ని కోట్లంటే.?

Update: 2025-10-11 05:16 GMT

OG 16 Days Collections:పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. కాంతార సినిమాతో కలెక్షన్లు తగ్గాయనే చెప్పవచ్చు. ఇక ఈ సినిమా విడుదలైన 16 రోజుల కలెక్షన్లకు సంబంధించిన ట్రేడ్ వర్గాల రిపోర్ట్ ప్రకారం. ప్రపంచ వ్యాప్తంగా 317 కోట్లకు పైగా గ్రాస్.. 187 కోట్ల నెట్ వసూళ్లు వచ్చినట్టు చెబుతున్నాయి.

సినిమా విడుదలైన 13 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్ర నిర్మాణ సంస్థ DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. 16వ రోజున (అక్టోబర్ 10) ఇండియా వైడ్‌గా ఈ సినిమా సుమారు రూ. 0.50 కోట్ల (నెట్) వసూలు చేసిందని అంచనా.

'ఓజీ' సినిమా కథ ప్రధానంగా ఓజాస్ గంభీర అలియాస్ ఓజీ అనే పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ చుట్టూ తిరుగుతుంది.ఈ చిత్ర దర్శకుడు సుజీత్, పవన్ కళ్యాణ్ అభిమాని కావడం వలన, పవన్ స్టైల్‌ను, ఎలివేషన్స్‌ను అత్యద్భుతంగా చూపించడానికి ప్రయత్నించారు.రవి కే చంద్రన్ సినిమాటోగ్రఫీ, తమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు పెద్ద బలంగా నిలిచాయి.ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలలో ఒకటిగా నిలిచి, బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది.

Tags:    

Similar News