OG Box Office: ఓజీ బాక్సాఫీస్..ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే.?
ఆరు రోజుల్లో ఎన్ని కోట్లంటే.?
OG Box Office: పవన్ కల్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా కలెక్షన్లు మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 154 కోట్ల గ్రాస్ వసూలు చేసి పవన్ కల్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఆరు రోజుల్లో ఇండియాలో రూ. 154 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 270 కోట్ల మార్కును దాటినట్లు అంచనా.
వారం రోజులు పూర్తైన తర్వాత కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. సినిమాకు వచ్చిన సమీక్షలు మిశ్రమంగా ఉన్నప్పటికీ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. పవన్ కల్యాణ్ నటన, స్టైల్, యాక్షన్ సీక్వెన్స్‌లు, నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. అయితే, కథనం, ద్వితీయార్థం అనుకున్నంత స్థాయిలో లేవని కొందరు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, పవన్ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్లకు పైగా థియేట్రికల్ రైట్స్ విక్రయించినట్లు అంచనా. నైజాం (తెలంగాణ)లో రూ. 40 కోట్లకు పైగా, ఆంధ్రప్రదేశ్‌లో రూ. 60 కోట్లకు పైగా రైట్స్ అమ్ముడయ్యాయి. ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రూ. 80 కోట్లకు పైగా భారీ ధరకు ఈ ఒప్పందం జరిగినట్లు సమాచారం.