OG Movie Collections: బాక్సాఫీస్ దగ్గర OG జోరు..నాల్గురోజుల్లో ఎన్ని కోట్లంటే.?
నాల్గురోజుల్లో ఎన్ని కోట్లంటే.?
OG Movie Collections: పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 230 కోట్లకు పైగా గ్రాస్ .. భారత్ లో మొత్తం రూ. 140.20 కోట్ల షేర్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాల అంచనా.
మొదటి రోజు వసూళ్లు: 'ఓజీ' సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 154 కోట్లకు పైగా వసూలు చేసి పవన్ కళ్యాణ్ కెరీర్‌లో అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది.
మొదటి మూడు రోజుల్లో: ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 200 కోట్లు దాటి వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్లో రూ. 200 కోట్ల మార్కును దాటిన మొదటి సినిమా.
ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. నాలుగు రోజుల్లో సుమారు $7 మిలియన్లు (రూ. 62 కోట్లు) వసూలు చేసింది. ఈ కలెక్షన్లు ట్రేడ్ వర్గాల నుంచి వచ్చిన అంచనాలు. సినిమా బృందం అధికారికంగా ప్రకటించినప్పుడు ఈ సంఖ్యలో తేడా ఉంటుంది.
రోజువారీ వసూళ్లు ( ఇండియా):
డే 1 (గురువారం): రూ. 63.75 కోట్లు (ప్రీమియర్లతో కలిపి రూ.91 కోట్లు)
డే 2 (శుక్రవారం): రూ18.75 కోట్లు
డే 3 (శనివారం): రూ18.5 కోట్లు
డే 4 (ఆదివారం):రూ18.5 కోట్లు