Brutal Murder of Actress Huma Qureshi’s Brother: పార్కింగ్ కోసం గొడవ..నటి హుమా ఖురేషీ సోదరుడు దారుణ హత్య

నటి హుమా ఖురేషీ సోదరుడు దారుణ హత్య;

Update: 2025-08-08 11:37 GMT

Brutal Murder of Actress Huma Qureshi’s Brother: ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో బాలీవుడ్ నటి హుమా ఖురేషీ కజిన్ ఆసిఫ్ ఖురేషీ హత్యకు గురయ్యారు. బైక్ పార్కింగ్ విషయంలో గొడవపడి దారుణంగా కత్తితో పొడిచి చంపారు దుండగులు.

పోలీసుల కథనం ప్రకారం, పార్కింగ్ వివాదం కారణంగా ఈ హత్య జరిగింది. ఆగస్టు 7న రాత్రి సుమారు 11 గంటల ప్రాంతంలో ఆసిఫ్ ఖురేషీ ఇంటి ముందు ఒక వ్యక్తి తన స్కూటర్‌ను పార్క్ చేశారు. ఆ స్కూటర్‌ను పక్కకు తీయమని ఆసిఫ్ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ వివాదం తీవ్రమై, సదరు వ్యక్తి తన సోదరుడితో కలిసి ఆసిఫ్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆసిఫ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు ఈ కేసులో నిందితులైన ఇద్దరు సోదరులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై హ్యుమా ఖురేషీ తండ్రి సలీమ్ ఖురేషీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇదే విషయంపై ఆసిఫ్‌తో నిందితులకు వాగ్వాదం జరిగినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో తెలిపారు.

Tags:    

Similar News