Pawan Fans: బెంగళూరులో పవన్ ఫ్యాన్స్ రచ్చ..కత్తితో థియేటర్ స్క్రీన్ చించి హంగామా

కత్తితో థియేటర్ స్క్రీన్ చించి హంగామా

Update: 2025-09-25 08:15 GMT

Pawan Fans: పవన్ ఓజీ ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో సందడి చేస్తోంది. పవన్ అభిమానులు నానారచ్చ చేస్తున్నారు.ఒక్కో చోట అభిమానం మితిమీరిపోతుంది. కత్తులు కటోరాలతో పవన్ అభిమానులు నానా హంగామా చేస్తున్నారు. ఒక్కో్సారి ఈ అభిమానం మితిమీరిపోతుంది. అవును పవన్ కళ్యాణ్ అభిమానులు బెంగళూరులోని ఓ థియేటర్‌లో స్క్రీన్‌ను చింపేశారు. పవన్ కళ్యాణ్ నటించిన 'ఓజీ' (OG) సినిమా ప్రీమియర్స్ సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకుంది.

బెంగళూరులోని కే.ఆర్.పురం థియేటర్‌లో ఓజీ' సినిమా ప్రీమియర్ షో సమయంలో సినిమా ప్రదర్శితమవుతున్నప్పుడు కొంతమంది అభిమానులు ఉత్సాహంతో థియేటర్ లోపలికి కత్తితో వచ్చి, స్క్రీన్‌ను చింపివేశారు. ఈ ఘటనతో థియేటర్ యాజమాన్యం వెంటనే షోను రద్దు చేసింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

ఈ రకమైన సంఘటనలు గతంలో కూడా జరిగాయి. పవన్ కళ్యాణ్ నటించిన 'బ్రో' సినిమా విడుదల సమయంలో కూడా పార్వతీపురం మన్యం జిల్లాలోని ఒక థియేటర్‌లో పాలాభిషేకం చేస్తూ అభిమానులు స్క్రీన్‌ను చింపేసినట్లు నివేదికలు వచ్చాయి.సినిమాపై అభిమానం ఉండడం సహజమే అయినప్పటికీ, ఈ విధంగా ప్రజా ఆస్తులకు నష్టం కలిగించడం, తోటి ప్రేక్షకులకు ఇబ్బందులు సృష్టించడం సరికాదని చాలామంది విమర్శిస్తున్నారు. ఇలాంటి చర్యలు హీరోలకూ, అభిమానులకూ చెడ్డపేరు తెస్తాయి.

Tags:    

Similar News