Pawan Mania: పవన్ మేనియా..ఓజీ ఫస్ట్ డే బాక్సాఫీస్ షేక్
ఓజీ ఫస్ట్ డే బాక్సాఫీస్ షేక్
Pawan Mania: పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ' (OG - They Call Him OG) బాక్సాఫీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించి రికార్డులు సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన ఫ్యాన్స్ పవన్ ఎలివేషన్స్, స్టైల్ ,యాక్షన్ సీన్స్ ,ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయిందని చెబుతున్నారు. పవన్ ఖాతాలో మరో హిట్ అని అంటున్నారు.
ఈ చిత్రం మొదటి రోజు కలెక్షన్లు అంచనాలకు మించి ఉన్నాయని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్లు, ఫస్ట్ డే కలెక్షన్లు కలిపి రూ.150కోట్ల గ్రాస్ ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా ప్రిమియర్స్ కలెక్షన్లే ఇండియాలో 70 కోట్లు వచ్చాయి.
ఓవర్సీస్ మార్కెట్ లో ఉత్తర అమెరికాలో కూడా ఈ చిత్రం అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. ప్రీమియర్ షోల ద్వారానే $3 మిలియన్ (26కోట్లు)మార్క్‌ను దాటి, 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది.అధికారిక కలెక్షన్ల లెక్కలు ఇంకా వెలువడలేదు. అయితే పవన్ కళ్యాణ్ స్టార్ పవర్‌కు, సినిమాకున్న క్రేజ్‌కు ఈ కలెక్షన్లు నిదర్శనమని ట్రేడ్ అనలిస్టులు చెబుతున్నారు.
ఓజీ' మొదటి రోజు కలెక్షన్లు
ప్రీమియర్ షోల కలెక్షన్లు (భారత్‌లో): రూ.23 కోట్లు
మొదటి రోజు (డే 1) నెట్ కలెక్షన్లు (భారత్‌లో): రూ.70 కోట్లు
మొత్తం వరల్డ్‌వైడ్ కలెక్షన్లు (ప్రీమియర్‌తో కలిపి) గ్రాస్: రూ.150 కోట్లు(అంచనా)