Hari Hara Veera Mallu: పవన్ హరిహర వీరమల్లు ఓటీటీ లోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

స్ట్రీమింగ్ ఎక్కడంటే?;

Update: 2025-08-20 06:21 GMT

Hari Hara Veera Mallu: పవన్ కళ్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' సినిమా అనేక వాయిదాల తర్వాత చివరికి జూలై 24, 2025న థియేటర్లలో విడుదలైంది. థియేటర్లలో ఆశించినంత విజయం సాధించలేకపోయినా, విడుదలైన నెలరోజుల్లోనే ఆగస్టు 20, 2025 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను మొదట క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. అయితే సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో, ఈ ప్రాజెక్ట్‌ను క్రిష్ శిష్యుడైన జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత విడుదలైన మొదటి సినిమా ఇది. ఈ సినిమా ప్రచార కార్యక్రమాలలో ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ఈ సినిమా 16వ శతాబ్దపు ఒక గజదొంగ కథ ఆధారంగా రూపొందించారు. కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే వీరుడి కథ ఇది. సినిమా థియేటర్లలో మిశ్రమ స్పందన పొందింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలలో విజువల్ ఎఫెక్ట్స్ (VFX) నాణ్యత, పట్టులేని కథనంపై విమర్శలు వచ్చాయి. దీనితో OTTలో విడుదలైన వెర్షన్‌లో కొన్ని మార్పులు, ట్రిమ్ చేసిన సన్నివేశాలు ఉన్నాయని సమాచారం. అంచనాలకు తగ్గట్టుగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రాణించలేదు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, వసూళ్లు నిరాశపరిచాయి. 'హరి హర వీరమల్లు' అనేక అడ్డంకులను దాటి థియేటర్లకు వచ్చినప్పటికీ, ప్రేక్షకులను ఆశించినంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే, ఇప్పుడు OTTలో అందుబాటులోకి రావడంతో డిజిటల్ ప్రేక్షకుల నుండి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.

Tags:    

Similar News