PEDDI Sensation: పెద్ది సంచలనం: చికిరి చికిరి సాంగ్‌కి 75 మిలియన్ల వ్యూస్..

చికిరి చికిరి సాంగ్‌కి 75 మిలియన్ల వ్యూస్..

Update: 2025-11-15 15:12 GMT

PEDDI Sensation: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం పెద్ది. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన చికిరి చికిరి పాట యూట్యూబ్‌లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. విడుదలైనప్పటి నుంచి సంగీత ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మెలోడీ సాంగ్ తాజాగా 75 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, 1.44 మిలియన్లకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో నెం.1 స్థానంలో కొనసాగుతుండటం విశేషం.

ఆస్కార్ విజేత సంగీతం, మేటి నటీనటులు

చికిరి చికిరి పాటకు ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ స్వరాలు అందించగా.. ప్రముఖ గాయకుడు మోహిత్ చౌహాన్ తన మధుర గాత్రంతో ప్రాణం పోశారు. బాలాజీ అందించిన సాహిత్యం పాటకు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది. ఈ పాట సాధించిన భారీ విజయం పెద్ది సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

భారీ స్థాయిలో విడుదల

మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

Tags:    

Similar News