Political Thriller “Bhadrakali”: పొలిటికల్ జానర్ లో భద్రకాళి..రిలీజ్ ఎపుడంటే.?

రిలీజ్ ఎపుడంటే.?;

Update: 2025-07-24 06:48 GMT

Political Thriller “Bhadrakali”: విజయ్ ఆంటోని నటించిన లేటెస్ట్ మూవీ భద్రకాళి. ఇది ఆయన కెరీర్‌లో 25వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా 2025 సెప్టెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని సినిమా యూనిట్ ప్రకటించింది. ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో సురేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయ్ ఆంటోని తన పుట్టినరోజు వేడుకలను కేక్ బదులు బిర్యానీ కట్ చేసి జరుపుకోవడం విశేషంగా నిలిచింది.

ఈ సినిమా రూ. 190 కోట్ల కుంభకోణం చుట్టూ తిరుగుతుందని, విజయ్ ఆంటోని పాత్ర విభిన్న షేడ్స్‌తో సాగుతుందని మేకర్స్ తెలిపారు.ఈ సినిమా విజయ్ ఆంటోని కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుందన్నారు. ఇది గతంలో వచ్చిన పొలిటికల్ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని విజయ్ ఆంటోని అన్నారు

అరువి చిత్రంతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న అరుణ్ ప్రభు పురుషోత్తమన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రామాంజనేయులు జవ్వాజీ (సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్), విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు. విజయ్ ఆంటోని స్వయంగా సంగీతం అందించిన ఈ మూవీ ఒక పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్. తెలుగు రాష్ట్రాల్లో ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాను విడుదల చేస్తోంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా మద్దతు కూడా ఈ సినిమాకు ఉంది.

Tags:    

Similar News