Allu Arjun–Atlee Movie: అల్లు అర్జున్ - అట్లీ మూవీలో పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!
పూజా హెగ్డే బంపర్ ఆఫర్..!
Allu Arjun–Atlee Movie: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, తమిళ దర్శకుడు అట్లీ కాంబినేషన్‍లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ప్రస్తుతం ఫిల్మ్ నగర్‍లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాలో ఒక ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేను సంప్రదించినట్లు, ఆమెకు ఏకంగా రూ. 5 కోట్ల భారీ పారితోషికాన్ని ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.
కూలీ సక్సెస్‌తో పెరిగిన డిమాండ్
ఇటీవల రజినీకాంత్ కూలీ చిత్రంలో పూజా హెగ్డే చేసిన స్పెషల్ సాంగ్ అద్భుతమైన విజయం సాధించడంతో ఆమెకు ఇటువంటి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్ మూవీకి పూజా హెగ్డే ఐటమ్ సాంగ్ కచ్చితంగా ప్రధాన ఆకర్షణగా మారుతుందని చిత్ర బృందం బలంగా నమ్ముతోంది. ఈ ప్రతిపాదనకు పూజా హెగ్డే కూడా సానుకూలంగా స్పందించినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్‌ను ఏప్రిల్ 8న అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన దీపికా పదుకొణే, జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్న వంటి ఆరుగురు ప్రముఖ కథానాయికలు నటించనున్నారని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే పూజా హెగ్డే ఐటమ్ సాంగ్, ఆమె పారితోషికంపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.