‘Raja Saab’ First Single: ప్రభాస్ ఫ్యాన్స్ రెడీగా ఉండండి.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేది రేపే
రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ వచ్చేది రేపే
‘Raja Saab’ First Single: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది. రెబల్ సాబ్' (Rebel Saab) అనే సాంగ్ ను రేపు( నవంబర్ 23) విడదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ పాట మాస్, ఎనర్జిటిక్ ఇంట్రో సాంగ్గా ఉంటుందని, ఇందులో ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో, డ్యాన్స్ మూమెంట్స్‌తో అలరించబోతున్నారని మేకర్స్ ప్రకటించారు.
మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ స్టైలిష్ లుక్‌లో కనిపించారు. ఈ పాట అభిమానులకు ఒక మాస్, ఎనర్జిటిక్ ట్రీట్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. ఈ పాట విడుదల ద్వారా సినిమా ప్రమోషన్లు అధికారికంగా మొదలవుతాయి. దర్శకుడు మారుతి రొమాంటిక్ హారర్ కామెడీ (ప్రభాస్ కొత్త జానర్)జానర్ లో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సంజయ్ దత్, బొమ్మన్ ఇరానీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
ఈ సినిమా నార్త్ అమెరికా (USA & Canada) థియేట్రికల్ హక్కులు భారీ ధరకు (దాదాపు $10 మిలియన్లు) అమ్ముడయ్యాయి. నార్త్ అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ డిసెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రీమియర్‌లు జనవరి 8న ప్రదర్శించబడతాయి.జనవరి 9,2026(సంక్రాంతి కానుకగా) విడుదల కానుంది.