Prabhas' New Look: స్పిరిట్ కోసం ప్రభాస్ న్యూ లుక్

ప్రభాస్ న్యూ లుక్;

Update: 2025-07-21 10:43 GMT

Prabhas' New Look: డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో చేయనున్న స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ కొత్త లుక్‌తో కనిపించబోతున్నారని టాలీవుడ్ లో చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఒక పోలీసు ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు. అందుకే క్యారెక్టర్ కు తగ్గట్లు ప్రభాస్ తన శరీరాన్ని మరింత ఫిట్‌గా, నాజూగ్గా మార్చుకుంటున్నారని సమాచారం. ఇప్పటికే జిమ్ వర్కౌట్స్‌తో పాటు కఠినమైన డైట్‌ను ఫాలో అవుతున్నారని తెలుస్తోంది.

ఇటీవల కొన్ని పబ్లిక్ ఈవెంట్స్‌లో కనిపించిన ప్రభాస్ కొత్త హెయిర్ స్టైల్, స్టైలిష్ లుక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కొత్త లుక్ 'స్పిరిట్' సినిమా కోసమేనని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కానుంది. ఈ లోపు ప్రభాస్ తన క్యారెక్టర్ కు తగ్గట్టు పూర్తిగా మేకోవర్ అవుతున్నారని తెలుస్తోంది.

స్పిరిట్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి, ఎందుకంటే అనిమల్ తర్వాత సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రానున్న చిత్రం ఇదే. ప్రభాస్ కొత్త లుక్, ఆయన క్యారెక్టర్ సినిమాకు మరింత హైప్ తీసుకొస్తాయని సినీ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. 

Tags:    

Similar News