'Jatadhara' Teaser: సుధీర్ బాబు జటాధర టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్

జటాధర టీజర్ రిలీజ్ చేసిన ప్రభాస్;

Update: 2025-08-09 15:07 GMT

'Jatadhara' Teaser: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా మెయిన్ రోల్ లో నటిస్తోన్న జటాధర సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఈ టీజర్‌ను ఆన్‌లైన్‌లో విడుదల చేశారు.

ఈ సినిమా ఒక మైథలాజికల్ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. కథాంశం అనంత పద్మనాభ స్వామి ఆలయం చుట్టూ తిరుగుతుందని, అందులోని నిధులు, రహస్యాల గురించి ఉంటుందని తెలుస్తోంది.టీజర్‌లో సోనాక్షి సిన్హా పవర్ ఫుల్ విలన్ పాత్రలో, సుధీర్ బాబు ఒక శివ భక్తుడిగా కనిపించారు.

విజువల్ ఎఫెక్ట్స్, భారీ యాక్షన్ సన్నివేశాలు, అలాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (BGM) సినిమాపై అంచనాలను పెంచాయి.ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడా విడుదల కానుంది. దీనికి వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నమ్రతా శోరోద్కర్ సోదరి శిల్పా శరోధ్కర్ కూడా ఓ పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే రిలీజైన 'జటాధర' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. జీ స్టూడియ సమర్పణలో ఉమేష్ కుమరా్ బన్సాల్,ప్రేరణ అరోరా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా తెలుగు, హిందీతో సహా పలు భాషల్లో పాన్ ఇండియా సినిమాగా విడుదల కానుంది.

Tags:    

Similar News