Raja Saab Shoot Complete: రాజాసాబ్ షూట్ కంప్లీట్..స్టైలీష్ లుక్ లో స్పెషల్ పోస్టర్

స్టైలీష్ లుక్ లో స్పెషల్ పోస్టర్

Update: 2025-11-13 05:48 GMT

Raja Saab Shoot Complete: ప్రభాస్ నటించిన 'ది రాజాసాబ్' (The Raja Saab) సినిమా నుంచి ఒక ప్రత్యేక పోస్టర్‌‌‌‌ను విడుదల చేశారు. ప్రభాస్ సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా (ఆయన మొదటి చిత్రం 'ఈశ్వర్' నవంబర్ 11న విడుదలైంది), దర్శకుడు మారుతి తన సోషల్ మీడియా ద్వారా ఈ పోస్టర్‌‌‌‌ను పంచుకున్నారు.

ఈ పోస్టర్‌లో ప్రభాస్ చాలా స్టైలిష్ లుక్‌లో కనిపించారు., ఆయన ఎరుపు , నలుపు కాస్ట్యూమ్‌లో, పొడవాటి జుట్టు, కళ్లద్దాలు ధరించి, నోట్లో సిగార్ పట్టుకుని మాస్ లుక్‌లో దర్శనమిచ్చారు. ఇది సినిమాలో ఒక డ్యాన్స్ నంబర్ (సాంగ్) నుండి తీసుకున్న లుక్ అని తెలుస్తోంది.పోస్టర్‌‌‌‌ను విడుదల చేస్తూ, దర్శకుడు మారుతి ఒక ఎమోషనల్ నోట్‌ను పంచుకున్నారు.

"23 ఏళ్ల క్రితం ఆయన సినిమాలోకి తొలి అడుగు వేశారు. ఈరోజు అదే రోజున మేము 'ది రాజాసాబ్' షూటింగ్‌ను ముగించాము. ఆయన విజయవంతమైన ప్రయాణంలో భాగం కావడం నాకు అదృష్టం. 'ది రాజాసాబ్' పూర్తిగా కొత్త ఎనర్జీతో ప్రేక్షకులను అలరించబోతుందని ఖచ్చితంగా చెప్పగలను.

ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ చిత్రం హారర్-కామెడీ జానర్‌లో వస్తోంది.జనవరి 9, 2026న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Tags:    

Similar News