Rajini’s Coolie Day 1 Collections: రజినీ కూలీ ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లంటే...?
ఫస్ట్ డే కలెక్షన్లు ఎన్ని కోట్లంటే...?;
Rajini’s Coolie Day 1 Collections: రజనీకాంత్ హీరోగా, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ అంచనాల మధ్య వచ్చిన కూలీ సినిమా మొదటి రోజు కలెక్షనులు ట్రేడ్ అనలిస్టులు సమాచారం ప్రకారం ఎన్ని కోట్లు వచ్చాయో ఒకసారి తెలుసుకుందాం.
ఇండియాలో కలెక్షన్‌లు
* నెట్ కలెక్షన్ (అన్ని భాషల్లో): రూ.65 కోట్లు (సాక్నిక్ అంచనాల ప్రకారం)
* తమిళనాడు: రూ28-30 కోట్ల గ్రాస్
* ఆంధ్రప్రదేశ్/తెలంగాణ: రూ.16-18 కోట్ల గ్రాస్
* కర్ణాటక: రూ.14-15 కోట్ల గ్రాస్
* కేరళ: రూ.10 కోట్ల గ్రాస్
* మిగతా రాష్ట్రాల్లో: రూ.7-8 కోట్ల గ్రాస్
ప్రపంచవ్యాప్త కలెక్షన్‌లు (అంచనా) మొత్తం గ్రాస్: రూ.140 కోట్లు
ఓవర్సీస్: సుమారు రూ.75 కోట్లు
కూలీ సినిమా రజనీకాంత్ కెరీర్‌లోనే అత్యధిక మొదటి రోజు కలెక్షన్‌లు సాధించిన సినిమాగా నిలిచింది. కానీ, విజయ్ "లియో" సినిమా మొదటి రోజు వసూలు చేసిన రూ.148 కోట్ల ప్రపంచవ్యాప్త రికార్డును మాత్రం అధిగమించలేకపోయింది.
ఆక్యుపెన్సీ
తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు అద్భుతమైన ఆదరణ లభించింది. తెలుగులో సగటున 92.10% ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళనాడులో 86.99%, హిందీ బెల్ట్‌లో 35.66% ఆక్యుపెన్సీ నమోదైంది.