Rajini's "Coolie": రజినీ కూలీ బొమ్మ హిట్టా.? ఫట్టా?..పబ్లిక్ ఏమంటున్నారు
పబ్లిక్ ఏమంటున్నారు;
Rajini's "Coolie": రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వచ్చిన కూలీ సినిమా ఎట్టకేలకే ఆగస్టు 14న థియేటర్లో విడుదలైంది. ఓవర్సీస్ తో పాటు కొన్ని చోట్ల బొమ్మ పడిపోయింది. సినిమా చూసిన చాలా మంది సోషల్ మీడియా ద్వారా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. కొందరు బాగుందంటే..మరి కొందరు బోరింగ్ అని ఇలా ప్రేక్షకుల నుంచి మిక్స్ డ్ టాక్ వస్తోంది. సినిమాలోని కొన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయని అభిమానులు ప్రశంసిస్తుండగా, మరికొన్ని అంశాలు నిరాశపరిచాయని కొందరు విమర్శిస్తున్నారు.
పాజిటివ్ పాయింట్స్
సినిమా మొత్తాన్ని రజనీకాంత్ తన భుజాలపై మోశారని, ఆయన స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ అభిమానులకు పండుగలా ఉందని చాలామంది అంటున్నారు. రజనీ అభిమానులకు ఇది ఒక ట్రీట్ అని చెబుతున్నారు. ఈ సినిమాలో నాగార్జున విలన్ పాత్రలో అద్భుతంగా నటించారని, ఇది సినిమాకు ఒక పెద్ద హైలైట్‌గా నిలిచిందని సోషల్ మీడియాలో పోస్టులు కనిపిస్తున్నాయి. ప్రీ-ఇంటర్వెల్ , ఇంటర్వెల్ సీన్స్, అలాగే క్లైమాక్స్ సన్నివేశాలు చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయని, రజనీకాంత్ మార్క్ యాక్షన్ బాగా వర్కౌట్ అయిందని చెబుతున్నారు.అనిరుధ్ రవిచందర్ అందించిన పాటలు, ముఖ్యంగా 'మోనికా' పాట, అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని ప్రశంసలు దక్కాయి.
నెగటివ్ పాయింట్స్
కొన్ని చోట్ల సినిమా చాలా నెమ్మదిగా సాగిందని, ముఖ్యంగా సెకండాఫ్‌లో కథనం కొంత ఫ్లాట్‌గా ఉందని కొందరు ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. లోకేష్ కనగరాజ్ నుంచి ఇంకా మెరుగైన అవుట్‌పుట్ ఆశించామని, ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలలో కొన్ని పాత పాటలను వాడటం, లియో సినిమాతో పోలిస్తే అంత ప్రభావ వంతంగా లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. క్లైమాక్స్ బాగా సాగదీసినట్లుగా ఉందని, ఇది సహనానికి పరీక్ష పెట్టిందని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి కూలీ' సినిమా రజనీకాంత్ వన్-మ్యాన్ షోగా నిలిచిందని, ఆయన అభిమానులను విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. అయితే, లోకేష్ కనగరాజ్ నుంచి అంచనాలు పెట్టుకున్న వారికి కొన్ని చోట్ల నిరాశ ఎదురైందని తెలుస్తోంది. అయితే, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.