Ram Charan Wins Hearts with His Simplicity: రామ్ చరణ్ సింప్లిసిటీకి అంతా ఫిదా.. జపాన్ ఫ్యాన్స్‌ను ప్రత్యేకంగా కలిసిన మెగాపవర్ స్టార్

జపాన్ ఫ్యాన్స్‌ను ప్రత్యేకంగా కలిసిన మెగాపవర్ స్టార్

Update: 2025-12-09 11:52 GMT

Ram Charan Wins Hearts with His Simplicity: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కు జపాన్‌లో ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా ఆయనపై ఉన్న అభిమానంతో ఏకంగా కొందరు జపనీస్ ఫ్యాన్స్ ఆయనను కలవడానికి ఇండియాకే వచ్చారు. ప్రస్తుతం తన తాజా చిత్రం పెద్ది షూటింగ్‌లో బిజీగా ఉన్న చరణ్, ఈ విషయం తెలుసుకుని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించి వారితో సమయం గడిపారు. తనను చూసేందుకు ఇంత దూరం నుంచి వచ్చిన అభిమానులను చరణ్ ఎంతో ఆప్యాయంగా పలకరించారు, వారితో సరదాగా మాట్లాడటంతో పాటు ఫొటోలు కూడా దిగారు. అభిమానుల పట్ల ఆయన చూపిన ప్రేమ, గౌరవం, సింప్లిసిటీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ తీరుపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

పెద్ది కోసం ఢిల్లీకి పయనం

మరోవైపు రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. చిత్ర యూనిట్ త్వరలోనే కీలక షెడ్యూల్ కోసం ఢిల్లీకి వెళ్లనుంది. దర్శకుడు బుచ్చిబాబు సానా అక్కడ సినిమాకు అత్యంత కీలకమైన యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలను భారీ ప్రణాళికలతో చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, జగపతి బాబు, బోమన్ ఇరానీ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముఖ్యంగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండటంతో పెద్దిపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీశ్‌ కిలారు నిర్మిస్తున్నారు.

Tags:    

Similar News