Ramayana Movie: రావణుడిగా చేస్తే అప్పుడు కూడా ట్రోల్స్ చేస్తారా?
ట్రోల్స్ చేస్తారా?
Ramayana Movie: బాలీవుడ్ డైరెక్టర్ నితీశ్ తివారీ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తు న్న తాజా మూవీ రామాయణ. సుమారు రూ.4 వేల కోట్ల భారీ బడ్జెట్తో ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ బ్యానర్ పై నమిత్ మల్హోత్రా దీన్ని నిర్మిస్తున్నాడు. ఇందులో రాముడి పాత్రలో రణబీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటి స్తున్న విషయం తెలిసిందే. ఈ పాత్రలకు సంబంధించిన పోస్టర్లు కూడా ఇటీవల రిలీజ్ కాగా, తాజాగా ఫస్ట్ గ్లింప్స్ ను కూడా విడుదల చేశారు. అయితే ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నప్పటికీ.. ఇందులో రాముడి పాత్రకు రణబీర్ ను ఎంపిక చేయడంపై చాలా మంది ట్రోల్స్ చేస్తున్నా రు. దీంతో ఈ ట్రోల్ పై ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. ఈ చిత్ర నిర్మాత నమిత్ మల్హోత్రాకు ఇచ్చిన ఇంటర్వ్చూలో రాముడిగా రణ్ బీర్ ఎంపికను ఆయన సమర్థించారు. గతంలో చేసిన పాత్రను దృష్టిలో పెట్టుకొని ట్రోల్స్ చేయడం అన్యాయమన్నారు. భవిష్యత్తులో మరో సినిమాలో రావణుడిగా చేస్తే అప్పుడు కూడా ట్రోల్స్ చేస్తారా? అని ప్రశ్నించారు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ మొదటి పార్ట్ 2026 దీపావళికి, రెండోది 2027 దీపావళికి విడుదల కానున్నాయి.