Ranbir as Lord Rama: రాముడి పాత్రలో రణ్ బీర్..ట్రోలర్స్ పై సద్గురు రియాక్షన్

ట్రోలర్స్ పై సద్గురు రియాక్షన్

Update: 2025-10-30 10:21 GMT

Ranbir as Lord Rama: నితీశ్ తివారీ డైరెక్షన్ లో రామాయణం మూవీ వస్తోన్న సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ 'రామాయణం' సినిమాలో రాముడి పాత్ర పోషించడంపై వస్తున్న విమర్శలకు లేటెస్ట్ గా సద్గురు జగ్గీ వాసుదేవ్ స్పందించారు. నిర్మాత నమిత్ మల్హోత్రా తో మాట్లాడిన ఆయన... రణ్‌భీర్ గతంలో ఎన్నో పాత్రలు చేశాడు. ఇప్పుడు రాముడి పాత్ర చేస్తున్నాడు. తనను ఈ పాత్రలో నటించవద్దని చెప్పటం అన్యాయం. తను ఈ పాత్ర మాత్రమే చేస్తాడని తెలియదు కదా! రేపు భవిష్యత్తులో రావణాసురుడి పాత్రలో కనిపించవచ్చు. అప్పుడు కూడా ట్రోలింగ్ చేస్తారా! అలా చేయటం సరైన పద్ధతి కాదు. అని అన్నారు.

యష్ గురించి అడగ్గా, అతను అందమైనవాడు, తెలివైనవాడు అని సద్గురు సమాధానమిచ్చారు. ఈ 'రామాయణం' చిత్రంలో రాముడి పాత్రలో రణ్‌భీర్ కపూర్, సీత పాత్రలో సాయి పల్లవి కనిపించనున్నారు.

ఈ మూవీ సుమారు రూ. 4,000 కోట్లు (రెండు భాగాలు కలిపి)తో నిర్మిస్తోన్న అత్యంత ప్రతిష్టాత్మకమైన భారీ బడ్జెట్ చిత్రం . ఈ మూవీ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. రణబీర్ కపూర్ తన పాత్ర కోసం మద్యం, మాంసాహారాన్ని మానేసి ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నారని సమాచారం. ఇది భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో హాలీవుడ్ స్థాయి నాణ్యతతో రూపొందుతోంది. ఈ చిత్రం హిందీతో పాటు పాన్-ఇండియాలోని అన్ని భాషలలో విడుదల కానుంది.

Tags:    

Similar News