Kamal Haasan: కోలీవుడ్ హీరో కమల్ హాసనక్కు అరుదైన గౌరవం దక్కింది. భారత్ నుంచి ఆస్కార్ అకాడమీలోకి ఆయనను ఆహ్వానిస్తున్నట్లు ది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ తెలిపింది. కమల్ తో పాటు బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, దర్శకురాలు పాయల్ కపాడియా, ఫ్యాషన్ డిజైనర్ మాక్సిమా బసు కూడా ఈ గ్లోబల్ క్లబ్లో భాగమయ్యారు.
ఈ ఏడాది కొత్తగా మొత్తం 534 మంది సభ్యులతో కూడిన జాబితాను ది అకాడమీ ఆఫ్ మోషన్ అండ్ సైన్సెస్ తాజాగా విడుదలచేసింది. ఇందులో 41% మంది మహిళలు ఉన్నారు. ఆస్కార్కు నామినేట్ అయ్యే చిత్రా ల్లో ఫైనల్ ఎంపిక ప్రక్రియలో వీరు ఓటు వే యనున్నారు. ఇక వచ్చే జనవరి 12 నుంచి 16 వరకు నామినేషన్ ప్రక్రియ జరుగు తుంది. వాటి పరిశీలన అనంతరం ఫైనల్ లిస్టును జనవరి 22న ప్రకటించనున్నారు.. మార్చి 15న ఆస్కార్ వేడుక జరగనుంది.