Ravi Teja Says He Loves Those 3 Films: ఫెయిల్ అయిన ఆ 3 సినిమాలు చాలా ఇష్టం - రవితేజ
ఆ 3 సినిమాలు చాలా ఇష్టం - రవితేజ
Ravi Teja Says He Loves Those 3 Films: ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి వచ్చి, మాస్ ఇమేజ్ తో స్టార్‌గా ఎదిగిన హీరో రవితేజ. ఆయన తాజా చిత్రం మాస్ జాతర ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. భాను భోగవరపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ధమాకా బ్లాక్ బస్టర్ తరువాత మరోసారి రవితేజ - శ్రీలీల జోడీగా కనిపించనున్నారు. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించారు.
డైరెక్షన్ వైపు పయనం
ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న రవితేజ, తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం గురించి మాట్లాడారు. మొదట్లో యాక్టింగ్ వైపు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని, అర్హత లేని వారికి సిఫార్సులతో అవకాశాలు దక్కడం చూసి నిరాశ పడ్డానని రవితేజ తెలిపారు. దీంతో హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదు గానీ, నటుడిగా మంచి గుర్తింపు పొందుతాననే నమ్మకంతో డైరెక్షన్ వైపు వెళ్లానని ఆయన వెల్లడించారు.
రవితేజ ఫేవరేట్ సినిమాలు: ఆడకపోయినా ఆ మూడూ ఇష్టమే
తన కెరీర్‌లో తనకు అత్యంత ఇష్టమైన మూడు సినిమాలు ఆడకపోయినా తన ఫేవరెట్ జాబితాలో ఉంటాయని రవితేజ చెప్పారు.
ఈగల్ సినిమాలో తన పాత్ర చాలా ఇష్టమని, అయితే స్క్రీన్ ప్లే కాస్త తేలికగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.
నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ సినిమా సరిగా ఆడకపోయినా, మంచి ఫీల్ ఉన్నందున చాలా ఇష్టమని, ఇది ఆ తర్వాత క్లాసిక్‌గా గుర్తింపు పొందిందని రవితేజ గుర్తు చేసుకున్నారు.
నేనింతే సినిమా కూడా తనకు చాలా ఇష్టమని, కానీ ఇది కూడా ప్రేక్షకులను మెప్పించలేదని తెలిపారు.
ఈ మూడు సినిమాలు ఆడకపోయినా తన హృదయానికి దగ్గరైన ఫేవరేట్ చిత్రాలుగా రవితేజ పేర్కొన్నారు.