Ravi Teja’s Film: సంక్రాంతి బరిలో రవితేజ సినిమా?
రవితేజ సినిమా?
Ravi Teja’s Film: మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సంక్రాంతి బరిలోకి దిగుతోంది. ఈ చిత్రానికి 'అనార్కలి' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ సంక్రాంతికి రవితేజ సినిమాతో పాటు మరిన్ని పెద్ద సినిమాలు కూడా పోటీలో ఉండే అవకాశం ఉంది. ఈసారి బాక్సాఫీస్ వద్ద త్రిముఖ పోటీ లేదా అంతకంటే ఎక్కువ సినిమాలు ఉండే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సినిమా ఒక పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని తెలుస్తోంది. దర్శకుడు కిశోర్ తిరుమల తన సినిమాల్లో ఉండే బలమైన భావోద్వేగాలు, హాస్యాన్ని ఈ సినిమాలో కూడా పొందుపరచనున్నారని భావిస్తున్నారు. రవితేజ మాస్ ఇమేజ్, కిశోర్ తిరుమల కథన నైపుణ్యం కలగలిపి ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తాయని అంచనా వేస్తున్నారు. రవితేజ నటించిన ‘ధమాకా, మాస్ జాతర’ వంటి చిత్రాల తర్వాత ఈ సినిమాకు కూడా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కోసం రవితేజ స్పెషల్‌గా మేకోవర్ అయ్యారు. ఆయన ట్రేడ్‌మార్క్ కామిక్ టైమింగ్, మాస్ అప్పీల్‌తో కూడన పూర్తిస్థాయి ఫ్యామిలీ డ్రామా కథను ఈ సినిమా కోసం సిద్ధం చేశారు కిషోర్ తిరుమల.