Akhil’s Movie: అఖిల్ సినిమాకు రవితేజ హీరోయిన్!
రవితేజ హీరోయిన్!;
Akhil’s Movie: టాలీవుడ్ యంగ్ హీరో, అక్కినేని వారసుడు అఖిల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న ఈ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అక్కినేని నాగా ర్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీలీలను తీసుకున్న విషయం తెలిసిందే. కానీ ఇతర ప్రాజెక్టుల్లో బిజీ బిజీగా ఉన్న ఈ భామ డేట్స్ అడ్జెస్ట్ కాక మూవీ నుంచి తప్పుకున్నట్లు సమాచారం. దీంతో శ్రీలీల స్థానంలో మరో భామను వెతికే పనిలో పడ్డ టీమ్ భాగ్యశ్రీ బేర్సేను సంప్రదించినట్లు తెలిసింది. మిస్టర్ బచ్చన్ మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ మొదటి సినిమాతోనే కుర్రకారు దృష్టిలో పడింది. ఆ తర్వాత కింగ్ డమ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీలోనూ మొదట విజయ్ దేవరకొండ సరసన శ్రీలీల నటిచాల్సి ఉండగా... ఆమె తప్పుకోవడంతో భా గ్యశ్రీకి అవకాశం లభించింది. తాజాగా లెనిస్ మూవీలోనూ శ్రీలీల తప్పుకోవడం భాగ్యశ్రీ కి మరో అవకాశం వచ్చేలా చేసింది. శ్రీలీల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ప్రాజెక్ట్‌లు ఓకే చేస్తున్నారు. ఆమె కథానాయికగా ‘జూనియర్’, ‘మాస్ జాతర’, ‘ప్రజాశక్తి’, ‘ఉస్తాద్ భగత్‌సింగ్’తోపాటు ‘ఆషికీ 3’ సినిమాలు రూపొందుతున్నాయి. ‘మిస్టర్ బచ్చన్’తో కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు భాగ్యశ్రీ బోర్సే. ప్రస్తుతం ఆమె ‘కింగ్డమ్’తోపాటు రామ్ పోతినేనితో ఒక సినిమా చేస్తున్నారు.