Samantha’s Web Series: సమంత్ వెబ్ సిరీస్ ఆగలేదు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
క్లారిటీ ఇచ్చిన మేకర్స్!
Samantha’s Web Series: ఆదిత్యరాయ్ కపూర్, సమంత నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రక్త బ్రహ్మాండ్’. దీనికి రాజ్, డీకే దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. తాజాగా దీనిపై దర్శకులు స్పందించారు. ఇది షెడ్యూల్ ప్రకారమే నడుస్తోందని చెప్పుకొచ్చారు. ఎన్నో షెడ్యూళ్లతో ప్రతిష్టాత్మ కంగా దీన్ని రూపొందిస్తున్నామని అన్నారు. ఇప్పటికే ఇండోర్ టాకీ షెడ్యూల్ దాదాపుగా పూర్తయిందని తెలిపారు. దీనితర్వాత భారీ అవుట్ డోర్ షెడ్యూల్ ప్లాన్ చేశామని, ఇందులో ఎక్కువగా యాక్షన్ సన్నివేశాల ను చిత్రీకరించనున్నామని అన్నారు. వాటికి అనుకూ లమైన వాతావరణం కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు. వర్షాలు పడే రోజుల్లో వీటిని చిత్రీకరించాల్సి ఉందని, అలాగే పచ్చదనం కూడా అవసరమని అందుకే కొన్ని రోజులు ఆగి ఈ షెడ్యూల్ ను ప్రారంభించనున్నామని చెప్పారు. ఈ యాక్షన్ ఫాంటసీ వెబ్ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్, సమంత, వామికా గబ్బీ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా అలీ ఫజల్ కీలక పాత్రలో కనిపించనున్నా రు. దీనికోసం నటీనటులు మార్షల్ ఆర్ట్స్, వెయిట్ లిఫ్టింగ్లలో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు.
క్యాప్షన్ ప్లీజ్
ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం మానేసి తెరంగేట్రం చేసిన ఛత్తీస్ గఢ్ భామ రాశీ సింగ్. ఈ అమ్మడు 2021లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆది సాయికుమార్ సరసన శశి సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత సంతోష్ శోభన్, శివ కందుకూరి, సుహాస్ వంటి అనేక మంది యువ నటులతో కలిసి నటించిందీ భామ. ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం వంటి చిత్రాలలో కీలక పాత్రలు పోషించింది. ప్రస్తుతం ఈ అమ్మడి చేతిలో రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. అసలు విషయానికి వస్తే.. సినిమాలతో పాటు నెట్టింట్లోనూ సందడి చేస్తోందీ భామ. ముదురు నీలం రంగు చీర ధరించి హొయలు పోతున్న ఒక ఫొటోను ఇన్ స్టాలో షేర్ చేసిందీ అమ్మడు. “నాకు ఒక క్యాప్షన్ ఇవ్వండి? అనే క్యాప్షన్ ను ఈ ఫొటోకు జోడించి.. అందాల రాశి హొయలు చూసి నేటిజ న్లు ఫిదా అవుతున్నారు. సూపర్ బేబీ అంటూ క్యాప్షన్ ఇస్తున్నారు. లైకులు, లవ్ ఎమోజీలతో ఈ భామను ఖుషీ చేస్తోందీ కుర్రకారు.