RGV’s Sensational Remark: సత్లుజ్ సినిమా కాదు చరిత్రలోని ఒక బలమైన గాయం.. - ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
RGV’s Sensational Remark: ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసిన చిత్రం 'సత్లుజ్'. సెన్సార్ సమస్యల కారణంగా నేరుగా ఓటీటీలో విడుదలైన ఈ సినిమాను.. ఆ తర్వాత అక్కడ నుంచి కూడా తొలగించారు. అయితే, ఈ వివాదాస్పద చిత్రాన్ని చూసిన సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. ఎక్స్ వేదికగా తనదైన శైలిలో స్పందించారు. 'సత్లుజ్ అనేది కేవలం సినిమా కాదు.. అది ఎప్పటికీ నయం కానీ ఒక బలమైన గాయం.. మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయాన్ని ఇది గుర్తు చేస్తుంది' అంటూ వర్మ పేర్కొన్నారు."
ఈ సినిమాలో నటించిన దిల్జిత్ దొసాంజ్, అర్జున్ రాంపాల్ నటనపై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. దిల్జిత్ ఎక్కడా గుండెలు బాదుకునేలా నటించలేదని.. తన మనఃసాక్షికి అనుగుణంగా ఎంతో నిశ్శబ్దంగా పాత్రలో లీనమైపోయాడని, అర్జున్ రాంపాల్ నటన సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందని కొనియాడారు. నేరాల్లో వ్యవస్థలు భాగమైన తీరును ఈ సినిమాలో ఎంతో వాస్తవికతతో చూపించారని.. దీన్ని ఒక సంచలనం చేయడం కన్నా, ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌గా అద్భుతంగా తీర్చిదిద్దారని వర్మ ప్రశంసించారు."
"ప్రజాస్వామ్య వ్యవస్థ తన పౌరులనే కబళించి, అందుకు సంబంధించిన సాక్ష్యాలు లేకుండా ఎలా తుడిచేస్తుందో సినిమాలో చూపించడం సాధారణ విషయం కాదన్నారు వర్మ. అధికారంలో ఉన్న వారందరికీ విన్నపం చేస్తూ.. 'సినిమాలో బాధితులను చేసినట్లు ఈ సినిమాను ఎన్కౌంటర్ చేయకండి. సత్లుజ్ లో జస్వంత్ సింగ్ ఖల్రాను ఏం చేశారో.. ఈ సినిమాకు ఆ పరిస్థితి తీసుకురాకండి. నిజాన్ని ఎంత దాచాలనుకుంటే అది అంత దృఢంగా మారుతుంది' అంటూ ఆర్జీవీ రాసుకొచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలో సైతం హాట్ టాపిక్‌గా మారాయి.