Milky Beauty: మిల్కీ బ్యూటీ పై సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్..

సీనియర్ నటుడు షాకింగ్ కామెంట్స్..

Update: 2025-10-14 05:39 GMT

Milky Beauty: తమన్నా భాటియా పేరు వినగానే మిల్కీ బ్యూటీ’ గుర్తొస్తుంది కదా.. ఇండస్ట్రీలో అడుగు పెట్టి ఇరవై ఏళ్లు అయినా, ఆమె అందం ఇప్పటికీ తక్కువ కాలేదు. తెలుగు, తమిళం, బాలీవుడ్, ఇప్పుడూ వెబ్ సిరీస్‌ వరకు ఎక్కడ చూసినా తమన్నే స్పాట్‌లైట్‌లో ఉంటుంది! కానీ ఈసారి ఆమె సినిమాల వల్ల కాదు… వ్యాఖ్యల వల్ల హాట్ టాపిక్ అయ్యారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తమన్న సరదాగా ‘స్త్రీ 2’ సినిమా లోని పాట పెట్టితే పిల్లలు అన్నం తింటారంటూ, నిద్రపోతారంటూ ఫన్నీగా మాట్లాడారు. అయితే ఆ జోక్‌ను సీరియస్‌గా తీసుకున్నాడు సీనియర్ నటుడు అన్నూ కపూర్! అయన చేసిన కామెంట్స్ మాత్రం అస్సలు అంచనాలకు మించి వల్గర్‌గా మారాయి. “తమన్నా పాలలాంటి శరీరం… 70 ఏళ్ల వృద్ధులు కూడా పిల్లల లాంటివాళ్లే కదా” అంటూ డబుల్ మీనింగ్ వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా ఆమె చర్మం, అందం గురించి అశ్లీలంగా మాట్లాడటం చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం ఒక్కటే ఫైర్ 'నువ్వు సీనియర్ నటుడివి కదా, ఇలా మాట్లాడతావా?' అని ఆగ్రహంతో మండిపడుతున్నారు. నీకు కూతుళ్లు, మనవరాళ్లు లేరా? అంటూ కామెంట్స్ రూపంలో అన్నూ కపూర్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇంతకీ ఈ వివాదం ఎక్కడ ఆగుతుందో, అన్నూ కపూర్ క్షమాపణ చెప్తారా లేక మరొకసారి ఘాటుగా స్పందిస్తారా? ఇదే ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్.

Tags:    

Similar News