Senior Actress Tulasi: సినిమాలకు గుడ్ బై..ఈ జీవితం ఇక సాయిబాబాకే అంకితం

ఈ జీవితం ఇక సాయిబాబాకే అంకితం

Update: 2025-11-20 05:57 GMT

Senior Actress Tulasi:  ప్రముఖ సీనియర్ నటి తులసి సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించారు. డిసెంబర్ 31 (ఈ ఏడాది) నుంచి నటనకు అధికారికంగా వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. ఆమె తన రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా భావోద్వేగ పోస్ట్ చేశారు. సినిమాలకు రిటైర్ అయ్యాక, తన జీవితాన్ని పూర్తిగా షిర్డీ సాయిబాబా సేవకు అంకితం చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. డిసెంబర్ 31న షిర్డీ దర్శనం చేసుకుని ఆ రోజు నుంచే తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తానని తెలిపారు.

తులసి తన మూడున్నర నెలల వయసులోనే (1967లో 'భార్య' చిత్రంలో) సినీ రంగ ప్రవేశం చేశారు.బాల నటిగా 'శంకరాభరణం', 'సీతామహాలక్ష్మి' వంటి చిత్రాలలో నటించి రెండు నంది అవార్డులు కూడా అందుకున్నారు. ఆమె తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో 300కు పైగా చిత్రాల్లో నటించారు. రెండో ఇన్నింగ్స్‌లో స్టార్ హీరోలకు అమ్మ పాత్రలు పోషిస్తూ తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.ఇటీవలి కాలంలో వెంకటేష్ హీరోగా వచ్చిన 'F3'లో సవతి తల్లిగా, అలాగే కొన్ని ప్రభాస్ చిత్రాల్లోనూ కనిపించారు. ఆమె పాత్రలు ప్రేక్షకులకు ఒక సుపరిచితమైన, ఆత్మీయ అనుభూతిని ఇచ్చేది.

నటి తులసి నిర్ణయం సినీ వర్గాలను, అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ, ఆమె భవిష్యత్ ప్రయాణానికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

Tags:    

Similar News