Abhishek Bachchan: నా ప్రతి విజయం వెనుక ఆమెనే.. అభిషేక్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
అభిషేక్ బచ్చన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Abhishek Bachchan: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తన పాతికేళ్ల సినీ ప్రయాణంలో సాధించిన ప్రతి విజయం వెనుక తన భార్య, నటి ఐశ్వర్య రాయ్ కృషి ఉందని అన్నారు. ఈ ఏడాది ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్న సందర్భంగా వేదికపై ఆయన తన భార్యపై ప్రశంసల వర్షం కురిపించారు. ఐ వాంట్ టు టాక్ చిత్రంలో అద్భుతమైన నటనకు గానూ అభిషేక్ బచ్చన్ ఈ ప్రతిష్టాత్మక ఉత్తమ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఈ అవార్డును గెలుచుకోవడానికి ఐశ్వర్యనే ప్రధాన కారణమని ఆయన అన్నారు. "నా జీవితంలో ప్రతి విజయానికి ఆమెనే మూలం. ఈ అవార్డు నా చేతికి రావడానికి ఆమె ఇచ్చిన ప్రోత్సాహం ఎంతో ఉంది" అని అభిషేక్ చెప్పారు.1
ఈ సందర్భంగా అభిషేక్ బచ్చన్ ఈ అవార్డును తన కుమార్తె ఆరాధ్యకు, తన తండ్రి అమితాబ్ బచ్చన్‌కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పురస్కారాన్ని స్వీకరించడం తనకు రెట్టింపు సంతోషాన్ని ఇచ్చిందని ఆయన అన్నారు. 25 ఏళ్లుగా తనను ప్రోత్సహిస్తున్న ప్రేక్షకులకు.. ఐ వాంట్ టు టాక్ దర్శకుడికి ఈ సందర్భంగా అభిషేక్ కృతజ్ఞతలు తెలియజేశారు. తాను ఎన్నో కష్టాలు దాటుకొని ఈ స్థాయికి వచ్చానని, తనకు అవకాశాలు ఇచ్చిన దర్శక నిర్మాతలందరికీ ఎప్పటికీ రుణపడి ఉంటానని అభిషేక్ బచ్చన్ తెలిపారు.