Smriti Irani's Re-Entry: స్మృతి ఇరానీ రీఎంట్రీ.. రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?;

Update: 2025-07-10 10:17 GMT

Smriti Irani's Re-Entry:  జైబోలో తెలంగాణ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు నటిగా పరిచయమైన కేంద్ర మాజీ మంత్రి, నటి స్మృతి ఇరానీ తులసీ విరానీ పాత్రలో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమవుతున్నారు. మరోసారి రంగప్రవేశం చేస్తున్నారు. `క్యుంకీ సాస్ బీ కభీ హూ తూ ' సీరియల్ రెండవ పార్ట్ కథ నచ్చడంతో అదే పాత్రలో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. పార్ట్ 2కి స్మృతి ఇరానీ అంగీకరించడంతో పారితోషికం అంశం తెరపైకి వస్తోంది. ఈ సీరియల్ కు గాను స్మృతి అక్షరాల రూ. 14 లక్షలు ఛార్జ్ చేస్తున్నారని కొత్త వార్త తెరపైకి వచ్చింది. ఈ న్యూస్ నిజమైతే, 2025లో టీవీ ఇండస్ట్రీలోనే హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే యాక్ట్రెస్‌గా ఆమె రికార్డు క్రియేట్ చేస్తుంది. ‘అనుపమ’ ఫేమ్ రూపాలీ గంగూలీ (ఎపిసొడ్‌కు రూ.3 లక్షలు)ని కూడా దాటేస్తుంది. అయితే ఇదే సీరియల్ కు ఆమె 25 ఏళ్ల క్రితం ఎపిసోడ్ కు రూ. 1800 మాత్రమే తీసుకున్నారు. అంతేకాదు సీరియల్ లోకి రాకముందు మెక్ డోనల్స్ లో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆ కంపెనీలో కూడా నెలకు రూ. 1800 మాత్రమే జీతంగా తీసుకునేవారట. క్యుంకీ సాస్ బీ కభీ హూ తూ ' అప్పట్లోనే 150 ఎపిసోడ్లు ప్రసారమైంది. దీనికి ఇప్పుడు సీక్వెల్ వస్తోంది. ఈ కొత్త సీరియల్ 2025, జులై 29 నుంచి రాత్రి 10:30 గంటలకు స్టార్ ప్లస్‌లో మొదలుకానుంది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలో... "తప్పకుండా వస్తాను... మిమ్మల్ని మళ్లీ కలిసే టైమ్ వచ్చింది (జరూర్ ఆవూంగీ... వక్త్ ఆ గయా హై ఆప్సే ఫిర్ మిల్నే కా)." అంటూ తులసి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Tags:    

Similar News