Star Heroine Samantha: రాజ్ నిడిమోరుతో సమంత దీపావళి సెలబ్రేషన్స్
సమంత దీపావళి సెలబ్రేషన్స్
Star Heroine Samantha: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి దీపావళి పండుగను జరుపుకున్నారు. వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు ఈ తాజా ఫోటోలు మరింత బలాన్నిచ్చాయి. సమంత తన సోషల్ మీడియా ఖాతాలో దీపావళి వేడుకలకు సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది. ఇందులో తాను బాణాసంచా కాలుస్తూ, దీపాలు వెలిగిస్తూ కనిపించింది. ఈ పోస్ట్‌లో దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి సమంత పోజు ఇచ్చిన ఫోటో కూడా ఉంది. ఇద్దరూ సంప్రదాయ దుస్తుల్లో చిరునవ్వులు చిందిస్తూ కనిపించారు. కొన్ని ఫోటోలలో రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులు కూడా ఉండటం గమనార్హం. ఈ ఫోటోలను పంచుకుంటూ సమంత "నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది అని క్యాప్షన్ ఇచ్చింది. 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్, రాజ్-డీకే దర్శకత్వంలో రూపొందిన 'సిటడెల్: హనీ బన్నీ' ప్రాజెక్టుల సమయంలో సమంతకు, రాజ్ నిడిమోరుకు మధ్య పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వీరిద్దరూ తరచూ కలిసి కనిపించడం, వెకేషన్లకు వెళ్లారనే వార్తలు రావడం, తాజాగా దీపావళి వేడుకలు కలిసి జరుపుకోవడం వంటి పరిణామాలు వారి రిలేషన్‌షిప్‌పై అభిమానుల అనుమానాలను పెంచాయి. ఈ పుకార్లపై సమంత కానీ, రాజ్ నిడిమోరు కానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. అయినప్పటికీ, పండుగ సందర్భంగా ఈ జంట ఫోటోలు వైరల్ కావడంతో, నెటిజన్లు సమంత తన రిలేషన్‌షిప్‌ను పరోక్షంగా బయటపెట్టిందని భావిస్తున్నారు.