Suchitra Drops Bombshell: విజయ్ -త్రిష బంధంపై సుచిత్ర బాంబు: ఆమె ఒక పారసైట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు!
ఆమె ఒక పారసైట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు!
Suchitra Drops Bombshell: తమిళనాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే చర్చ.. ఒకటే రచ్చ.రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి.. ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి.. 'దళపతి' విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించారు. కానీ.. ఆ గెలుపు ఉత్సాహాన్ని ఎంజాయ్ చేసే లోపే.. ఆయన వ్యక్తిగత జీవితం చుట్టూ వివాదాల ముసురు మొదలైంది.
ముఖ్యంగా.. విజయ్, నటి త్రిష కృష్ణన్ మధ్య ఉన్న రిలేషన్ షిప్ గురించిన రూమర్స్ నెట్టింట రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఈ సెగ చల్లారకముందే.. సింగర్ సుచిత్ర చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు కోలీవుడ్‌ను షేక్ చేస్తున్నాయి.నటి త్రిషను టార్గెట్ చేస్తూ సుచిత్ర చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మంటలు రేపుతున్నాయి. త్రిషను నేరుగా 'పారసైట్'.. అంటే ఒక పరాన్నజీవితో పోల్చారు సుచిత్ర.
ఆమె మాటల్లోనే చెప్పాలంటే.."విజయ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులకు, భార్యకు దూరమై ఒంటరిగా ఉన్నాడు. ఇలాంటి క్లిష్ట సమయంలోనే సక్సెస్‌ఫుల్ వ్యక్తుల జీవితాల్లోకి ఇలాంటి పరాన్నజీవులు ప్రవేశిస్తాయి. ఎన్నికల విజయం తర్వాత విజయ్‌కు పెరిగిన క్రేజ్‌ను వాడుకోవడానికే.. త్రిష ఆయన పక్కన చేరుతోంది.
ఒకవైపు విజయ్ రాజకీయ భవిష్యత్తుపై అభిమానులు ఆశలు పెట్టుకుంటే.. మరోవైపు ఈ వ్యక్తిగత ఆరోపణలు ఆయన ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తాయా? అసలు సుచిత్ర ఎందుకింత ఘాటుగా స్పందించారు? ఈ వివాదం ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి!