Sunnysanskari ki Tulsi Kumari: సన్నీ సంస్కారీకి తుల్సీ కుమారీ కలెక్షన్లు డ్రాప్
తుల్సీ కుమారీ కలెక్షన్లు డ్రాప్
Sunnysanskari ki Tulsi Kumari: వరుణ్ ధావన్, జాన్వీ కపూర్ నటించిన 'సన్నీ సంస్కారీకి తుల్సీ కుమారీ' సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి. ఈ సినిమా 8 రోజుల్లో (మొదటి వారం) భారత్ లో (Net) కలెక్షన్ సుమారుగా రూ. రూ40 కోట్లు సాధించింది. ఈ సినిమా 'కాంతారా: చాప్టర్ 1' తో పాటు విడుదల కావడంతో, ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో, తీవ్ర పోటీని ఎదుర్కొంది.
సాక్ నిల్క్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా మొదటి రోజు అక్టోబర్ 2 రూ. 9.25 కోట్లు సాధించింది. వీకెండ్ లో 8 కోట్ల వరకు వచ్చాయి. ఇక సోమవారం నుంచి ఈసినిమా కలెక్షన్లు భారీగా తగ్గాయి. సోమవారం రూ. 3.25 కోట్లు, మంగళవారం 3.25 కోట్లు, గురువారం మరింత పడిపోయాయి. కేవలం రూ. 1.66 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి. మొత్తం 8 రోజుల్లో 40 కోట్ల నెట్ వసూళ్లు వచ్చాయి.
సన్నీ సంస్కారీ (వరుణ్ ధావన్) అనే యువకుడు తన ప్రియురాలు అనన్య (సన్యా మల్హోత్రా) పెళ్లిని ఆపడానికి ప్రయత్నిస్తాడు. అనన్య వేరే వ్యక్తి విక్రమ్ (రోహిత్ సరాఫ్)ను వివాహం చేసుకోబోతుంది. దీంతో, సన్నీ, విక్రమ్‌కు మాజీ ప్రేయసి అయిన తుల్సీ కుమారీ (జాన్వీ కపూర్)తో జతకడతాడు. అనన్య, విక్రమ్‌లలో అసూయ పుట్టించడం కోసం సన్నీ, తుల్సీలు తాము ప్రేమించుకుంటున్నట్టు నటిస్తారు. అయితే, ఈ నటనలో భాగంగానే వారిద్దరి మధ్య అనుకోని ప్రేమ చిగురిస్తుంది. చివరికి, ఒకరి కోసం ఒకరు అన్నట్టుగా మారిన సన్నీ, తుల్సీల ప్రేమకథ ఎలాంటి మలుపు తీసుకుందనేది ఈ సినిమా.