Tamannaah Bhatia: తమన్నాకు మద్రాస్ హైకోర్టు షాక్

మద్రాస్ హైకోర్టు షాక్

Update: 2026-04-16 11:12 GMT

Tamannaah Bhatia: స్టార్ హీరోయిన్ తమన్నాకు మద్రాస్ హైకోర్టులో గట్టి షాక్ తగిలింది. సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఒక సివిల్ కేసులో ఆమెకు అనుకూలంగా తీర్పు రాలేదు సదాపా , కోర్టు ఆమె వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అసలు తమన్నా కోర్టుకు ఎందుకు వెళ్లారు? కోర్టు చెప్పిన కారణాలేంటి? అంటే..

ఈ వివాదం దాదాపు పదేళ్ల క్రితం నాటిది. ‘పవర్ సోప్స్’ అనే సంస్థతో తమన్నా 2008-09 కాలానికి బ్రాండ్ అంబాసిడర్‌గా ఒప్పందం చేసుకున్నారు. అయితే, తన ఒప్పందం ముగిసిన తర్వాత కూడా, అంటే 2010-11 సంవత్సరాల్లో సదరు సంస్థ తన ఫోటోలను వాణిజ్య ప్రకటనల కోసం వాడుకుందని తమన్నా ఆరోపించారు. ఇది ఒప్పంద నిబంధనల ఉల్లంఘన అని, తన అనుమతి లేకుండా ఫోటోలు వాడటం సరికాదని ఆమె కోర్టు మెట్లు ఎక్కారు.తన ఫోటోలను అక్రమంగా వాడుకున్నందుకు గానూ, సదరు సంస్థ నుంచి రూ. కోటి నష్టపరిహారం ఇప్పించాలని ఆమె తన పిటిషన్‌లో కోరారు. తన ఇమేజ్‌ను వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకుని లాభపడ్డారని, అందుకే తనకు పరిహారం దక్కాలని ఆమె తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఏళ్ల తరబడి ఈ కేసు విచారణ సాగింది.

ఈ కేసును విచారించిన మద్రాస్ హైకోర్టు, తమన్నా వాదనతో ఏకీభవించలేదు. ఈ ప్రచార చిత్రాల వల్ల నటి ప్రతిష్టకు ఎలాంటి భంగం కలగలేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రధానంగా, రూ. కోటి నష్టపరిహారం కోరడానికి సరైన ఆధారాలు మరియు కారణాలను ఆమె చూపలేకపోయారని ధర్మాసనం స్పష్టం చేసింది. ఒప్పందం ముగిశాక ఫోటోలు వాడటం సాంకేతికంగా పొరపాటే అయినా, అది కోటి రూపాయల నష్టానికి దారి తీసిందని చెప్పడానికి తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను కొట్టివేసింది.దీంతో ఈ సుదీర్ఘ పోరాటంలో తమన్నాకు నిరాశే ఎదురైంది. సెలబ్రిటీల బ్రాండ్ ఒప్పందాల విషయంలో కోర్టు ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News