Tanikella Bharani: ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ పర్యటనలో ఒక అరుదైన, భావోద్వేగపూరిత సన్నివేశం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి ప్రధానిని కలిసిన వేళ తన మనసులోని మాటను అత్యంత భక్తిశ్రద్ధలతో పంచుకున్నారు.

ప్రధానితో కలిసి దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పంచుకుంటూ.. తనికెళ్ల భరణి గారు ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. "నేను రాముణ్ని చూడలేదు.. కృష్ణుణ్ని చూడలేదు.. ఆదిశంకరుల్ని, వివేకానందుణ్ని చూడలేదు.. చూడలేం కూడా. కానీ, వాళ్లందరి అంశలతో ఉన్న మోదీని చూశాను, ముట్టుకున్నాను, ఆయన చేతిని ముద్దెట్టుకున్నాను.. నా జన్మ ధన్యం" అంటూ పరవశించిపోయారు.

ఆదివారం హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికే క్రమంలో విమానాశ్రయంలో ఈ భేటీ జరిగింది. ఒక గొప్ప నటుడిగా, ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తిగా తనికెళ్ల భరణి మోదీపై చూపిన ఈ అపారమైన గౌరవం ఇప్పుడు నెట్టింట చర్చనీయాంశంగా మారింది.

రాజకీయాలకు అతీతంగా మోదీ వ్యక్తిత్వాన్ని, ఆయనలోని నాయకత్వ లక్షణాలను మహనీయుల అంశలతో పోల్చుతూ భరణి చేసిన వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

Tags: