Thama Teaser Released: హరర్ రొమాంటిక్..రష్మిక థామా టీజర్ రిలీజ్
రష్మిక థామా టీజర్ రిలీజ్;
Thama Teaser Released: ఆయుష్మాన్ ఖురానా, రష్మికా మందన, నవాజుద్దీన్ సిద్ధిఖీ, పరేష్ రావల్ వంటి అగ్ర తారలు నటించిన 'థామా' సినిమా టీజర్ ఇవాళ విడుదలైంది.ఈ సినిమా టీజర్ చూస్తుంటే, ఇది ఒక హారర్- కామెడీ యూనివర్స్ లోని సినిమా అని తెలుస్తోంది. ఇది రెండు విభిన్న (ప్రస్తుత భారతదేశం , ప్రాచీన విజయనగర సామ్రాజ్యం) కాలాల్లో జరుగుతుంది.ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ఒక చరిత్ర పరిశోదకుడి పాత్రలో కనిపిస్తారు.
ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఒక పీరియడ్ డ్రామా, హారర్- రొమాంటిక్ చిత్రం. ఆయుష్మాన్ ఖురానా (అలోక్), రష్మికా మందన (తడక), నవాజుద్దీన్ సిద్ధిఖీ (యక్షశాన్), పరేష్ రావల్ నటిస్తున్నారు. స్త్రీ', 'భేదియా, ముంజియా' వంటి సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన అదే నిర్మాణ సంస్థ ఈ సినిమాను కూడా నిర్మిస్తోంది. ఈ చిత్రం 2025లో దీపావళికి ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.