Aishwarya Rai’s Interesting Remarks: మహిళల అతిపెద్ద ఆయుధం అదే.. ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఐశ్వర్యరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Aishwarya Rai’s Interesting Remarks: నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నప్పటికీ, కొన్ని సందర్భాల్లో తమ ఇష్టాలను పక్కన పెట్టి ఇతరుల కోసం రాజీపడుతుంటారు. దీనిపై ఐశ్వర్యరాయ్ స్పందిస్తూ.. మహిళలు తమ గొంతుకను ఒక ఆయుధంలా వాడాలని సూచించారు.
అభిప్రాయ వ్యక్తీకరణే అసలైన శక్తి
మనకు ఏదైనా నచ్చనప్పుడు లేదా మన విలువలకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు నిర్మొహమాటంగా మన అభిప్రాయాన్ని చెప్పడం నేర్చుకోవాలి. అది ఇంట్లో అయినా, ఆఫీసులో అయినా ఎదుటివారి కోసం మన వ్యక్తిత్వాన్ని చంపుకోవడం సరైనది కాదు. ప్రతి విషయానికి అవును అంటూ తలలూపడం వల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుందని ఐశ్వర్య అభిప్రాయపడ్డారు. నచ్చని విషయాలకు నో చెప్పడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆమె తెలిపారు. సైకాలజిస్టులు కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరిస్తున్నారని ఆమె తెలిపారు.
హద్దులు ఉంటేనే గౌరవం
మనకంటూ కొన్ని పరిమితులు, హద్దులు గీసుకున్నప్పుడే సమాజంలో ఎదుటివారి నుంచి గౌరవం లభిస్తుంది. మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూనే విజయాలను అందుకోవాలి. ఆత్మవిశ్వాసంతో తమ మాటను వినిపించే మహిళలే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని, ప్రతి విషయాన్ని ఒక సవాల్‌గా తీసుకుని ముందుకు సాగాలని ఆమె ఆకాంక్షించారు.
విజయమే కాదు.. విలువలూ ముఖ్యమే
కేవలం విజయాలను సాధించడమే గొప్పతనం కాదని మన విలువలకి కట్టుబడి ఉండటం, తప్పుడు విషయాలను తిరస్కరించడం కూడా ఒక గొప్ప విజయమేనని ఐశ్వర్య మహిళల్లో స్ఫూర్తిని నింపారు.