Deepika Padukone: అందుకే సిద్ధార్థ్ మాల్యాకు బ్రేకప్ చెప్పా : దీపికా పదుకొణె
సిద్ధార్థ్ మాల్యాకు బ్రేకప్ చెప్పా : దీపికా పదుకొణె
Deepika Padukone: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె, వ్యాపారవేత్త సిద్ధార్థ్ మాల్యా మధ్య గతంలో జరిగిన ఒక సంఘటన గురించి కొన్ని సంవత్సరాల క్రితం మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది. ఈ సంఘటన దీపికా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెలుగులోకి వచ్చింది.దీపికా, సిద్ధార్థ్ మాల్యాలతో డేటింగ్ చేస్తున్న సమయంలో, ఒకసారి డిన్నర్ డేట్‌కి వెళ్ళారు.డిన్నర్ తర్వాత, బిల్లు చెల్లించమని సిద్ధార్థ్ మాల్యా దీపికను కోరినట్లుగా ఆమె పేర్కొన్నారు. ఈ సంఘటనపై దీపిక చాలా అసహనంగా, ఇబ్బందిగా ఫీల్ అయ్యారు."నాకు చాలా అవమానకరంగా అనిపించింది" అని తెలిపారు. ఆ సంఘటన తర్వాత తన సంబంధాన్ని కొనసాగించడానికి ఆమెకు ఏ మాత్రం ఆసక్తి లేదని, అది విడిపోవడానికి ఒక కారణమని కూడా వెల్లడించారు. అయితే, ఈ వార్తలపై సిద్ధార్థ్ మాల్యా స్పందిస్తూ, అది పూర్తిగా తప్పు అని, తనకు ఈ వివాదం గురించి అర్థం కాలేదని అన్నారు. తన తండ్రి (విజయ్ మాల్యా) ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున, తాను ఆమెకు డబ్బు తిరిగి ఇస్తానని చెప్పినా ఆమె అంగీకరించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ సంఘటన తర్వాత వీరిద్దరూ విడిపోయారని మీడియా వర్గాలు పేర్కొన్నాయి. ఈ విషయంపై రెండు వైపుల నుంచి భిన్నమైన వాదనలు వినిపించాయి. కాగా దీపికా పదుకొణె భర్త బాలీవుడ్ నటుడు రణవీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. వీరికి 2024లో కుమార్తె దువా జన్మించింది.