Director Anil’s Interesting Remarks: ఆ హీరోలు ఇచ్చే ఆ స్వేచ్ఛే నా సక్సెస్ సీక్రెట్.. డైరెక్టర్ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
డైరెక్టర్ అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Director Anil’s Interesting Remarks: వెంకటేష్, బాలకృష్ణ వంటి అగ్ర హీరోలు దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనిస్తారని డైరెక్టర్ అనిల్ రావిపూడి తెలిపారు. వారు ఇచ్చే ఆ ఫ్రీడమ్ వల్లే వెండితెరపై అద్భుతమైన అవుట్‌పుట్ వస్తుందని, వారి ఇమేజ్‌ను కాపాడుతూనే తన మార్కు వినోదాన్ని జోడించడం తనకు అలవాటని చెప్పారు. తన సినిమాలకు వచ్చే వారిలో 80 శాతం మంది ఫ్యామిలీ ఆడియన్సే ఉంటారని అనిల్ తెలిపారు. ఎఫ్-2, ఎఫ్-3 వంటి చిత్రాలు కుటుంబమంతా కలిసి నవ్వుకునేలా ఉండటం వల్లే భారీ వసూళ్లు సాధించాయని ఆయన విశ్లేషించారు.
తన చిత్రాల్లో కేవలం హాస్యం మాత్రమే ఉండదని, దాని వెనుక బలమైన భావోద్వేగాలు, ఒక అంతర్లీన సందేశం తప్పనిసరిగా ఉంటాయని స్పష్టం చేశారు. కేవలం కామెడీతోనే సినిమా హిట్ అవ్వదని, కథతో ప్రేక్షకులు మమేకం అవ్వాలని ఆయన అభిప్రాయపడ్డారు. స్క్రిప్ట్ రాసేటప్పుడు తాను కేవలం రచయితగానే ఆలోచిస్తానని, సెట్స్‌పైకి వెళ్ళినప్పుడు మాత్రమే దర్శకుడి బాధ్యత తీసుకుంటానని తన పనితీరును వివరించారు. రీమేక్ సినిమాల కంటే కొత్త కథలకే తాను ఎప్పుడూ ప్రాధాన్యత ఇస్తానని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందని, విమర్శలను స్వీకరిస్తానని అనిల్ చెప్పారు. అయితే, విమర్శల పేరుతో వ్యక్తిగత దూషణలకు దిగడం సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా తనను తాను అప్‌డేట్ చేసుకుంటూ, ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని అందించడమే తన ముందున్న ప్రధాన లక్ష్యమని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేశారు.