The Kumbh Mela Beads Girl: టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన..కుంభమేళా పూసలమ్మాయి
కుంభమేళా పూసలమ్మాయి
The Kumbh Mela Beads Girl: ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో రుద్రాక్షమాలలు, పూసలు అమ్ముతూ తన అందమైన కనులతో సోషల్ మీడియా ద్వారా దేశం దృష్టిని ఆకర్షించిన మోనాలిసా, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తోంది. ఆమె తొలి సినిమాగా రాబోతున్న చిత్రానికి 'లైఫ్' అనే ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు. సాయిచరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంగమాంబ క్రియేషన్స్ బ్యానర్పై నిర్మాత గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీను కోటపాటి దర్శకత్వం వహిస్తున్నారు.
'లైఫ్' సినిమా ప్రారంభోత్సవం ఇవాళ(బుధవారం) హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో ఘనంగా జరిగింది. సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి పూజ కార్యక్రమంతో 'లైఫ్' చిత్రం ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి సీనియర్ నటుడు సురేష్ క్లాప్ కొట్టగా, నిర్మాత డీఎస్ రావ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. శివన్నారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. చిత్ర నిర్మాత అంజయ్య మాట్లా
డుతూ.. ఈ చిత్ర కథ సాఫ్ట్వేర్ ఉద్యోగుల జీవితాల్లో చోటుచేసు కుంటున్న ఘటనల ఆధారంగాఉంటుందన్నారు.. ఈ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రముఖులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.