The RajaSaab: ప్రభాస్ లేటెస్ట్ సినిమా 'ది రాజా సాబ్ (The RajaSaab)ఇప్పటికే విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ట్రైలర్ ఈ రోజు (సెప్టెంబర్ 29, 2025) సాయంత్రం 6 గంటలకు విడుదల కానుంది.ఈ విషయాన్ని సినిమా నిర్మాతలు అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. ప్రభాస్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఫ్యాన్స్ చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.
మారుతి దర్శకత్వంలో హారర్-కామెడీలో ప్రభాస్ ఎలా కనిపిస్తాడనేది చూడటానికి అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఈ ట్రైలర్ సినిమాలోని ప్రధాన అంశాలను, ప్రభాస్ పాత్ర స్వభావాన్ని మరింత స్పష్టంగా చూపిస్తుందని అంచనా వేస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ సినిమాలో నాలుగు పాటలు ఉన్నాయని, అవి సినిమాకు హైప్ తీసుకువస్తాయని చెప్పారు.
ఈ సినిమాకు బడ్జెట్ రూ. 400 నుంచి రూ. 450 కోట్ల వరకు ఉన్నట్లు అంచనా. ఈ సినిమాపై ప్రభాస్ అభిమానులు భారీగా ఆసక్తి కనబరుస్తున్నారు. ఇది ప్రభాస్ కెరీర్‌లో ఒక కొత్త రకమైన ప్రయత్నంగా భావిస్తున్నారు.
ఈ మూవీలో ప్రభాస్, మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. జనవరి 9, 2026 (సంక్రాంతికి) రిలీజ్ కాబోతోంది.