Akhil: ఇవే నా స్వీట్ మెమోరీస్.. అఖిల్ ఎమోషనల్ పోస్టు

అఖిల్ ఎమోషనల్ పోస్టు;

Update: 2025-06-30 04:16 GMT

Akhil: టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని తన చిరకాల ప్రేయసి జైనాబ్ తో ఈనెల 6న వివాహబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మ్యారేజ్ తర్వాత గ్రాండ్ రిసెప్షన్ వేడుక కూడా జరిపారు. ఈ ఫంక్షన్ కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే పెండ్లి జరిగిన అనంతరం కింగ్ నాగార్జున తన సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫొటోలు మాత్రమే షేర్ చేశాడు. చైతూ కూడా ఇన్స్టాలో కొన్ని పిక్స్ పంచుకున్నాడు. తాజాగా అఖిల్ తన సోషల్ మీడియా వేదికగా పెండ్లి ఫొటోలను అభిమానులతో పంచుకున్నా డు. ‘జూన్ 6, 2025.. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించింది. ఈ స్వీట్ మెమోరీస్ అందించిన వారికి ధన్యవాదాలు' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం న్యూ కపుల్ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే అఖిల్ షేర్ చేసిన ఫొటోలలో నాగ చైత‌న్య‌, శోభిత‌ల పిక్ ఒక్క‌టి కూడా లేక‌పోవ‌డం గ‌మ‌న‌ర్హం ఏది ఏమైన అఖిల్,జైన‌బ్‌ల పెళ్లి వేడుక అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. అంతేకాదు ఆ జంట‌కి పెద్ద ఎత్తున శుభాకాంక్ష‌లు కూడా వెల్లువెత్తాయి. అఖిల్ భార్య జైనబ్ బడా పారిశ్రామికవేత్త జుల్ఫీ కుమార్తె కాగా, ఆమె వేల కోట్ల ఆస్తులకు వారసురాలు అని అంటున్నారు. అఖిల్ క‌న్నా జైన‌బ్ 9 సంవ‌త్సార‌లు పెద్ద‌ది. ఈ ఇద్ద‌రి మ‌ధ్య ఏదో సంద‌ర్భంలో ప‌రిచ‌యం ఏర్ప‌డి అది ప్రేమ‌గా మారింద‌ని అంటున్నారు. జైనబ్ తండ్రి జుల్ఫీ, నాగార్జున కుటుంబాలకు కూడా వ్యాపారంలో పరిచయాలు ఉన్నాయని, ఆ క్ర‌మంలోనే వారి ప్రేమ‌, పెళ్లికి వెంట‌నే గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చిందని అంటున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అఖిల్ ప్రస్తుతం 'లెనిన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈచిత్రాన్ని మురళీ కిషోర్ అబ్బూరు దర్శ కత్వం వహిస్తున్నారు. రాయలసీమ బ్యాక్ ప్లో లవ్ అండ్ యాక్షన్ జానర్లో తెరకెక్కుతున్న ఈ మూవీలో హీరోయిన్ గా భాగ్యశ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. 

Tags:    

Similar News