Mass Jathara: మాస్ జాతర నుంచి మూడో సింగిల్
మూడో సింగిల్
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న 'మాస్ జాతర' చిత్రం నుంచి 'హుడియో హుడియో' పాట విడుదలైంది. ఇది సినిమాలోని మూడవ సింగిల్, ఒక రొమాంటిక్ మెలోడీ ట్రాక్. అంతకుముందు విడుదలైన 'తు మేరా లవర్, 'ఓలే ఓలే' పాటలు మాస్ బీట్‌తో సాగగా, ఈ పాట సాఫ్ట్ మెలోడీగా ఆకట్టుకుంటోంది. దేవ్ అందించిన ఈ పాట "చిట్టి చిలకా.. చిన్న మొలకా.." అనే పల్లవితో సాగుతుంది. సాంగ్ లో రవితేజ,శ్రీలీల కెమెస్ట్రీ బాగుంది. ఈ పాటను సంగీత దర్శకులు హేషమ్ అబ్దుల్ వహాబ్, భీమ్స్ సిసిరోలియో కలిసి పాడారు.
మాస్ జాతర' మాస్ మహారాజా రవితేజ ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం. ఇది రవితేజ 75వ చిత్రం కావడం విశేషం. ఇది ఫుల్-ఆన్ యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో రూపొందుతోంది.రవితేజ ఈ సినిమాలో పవర్‌ఫుల్ రైల్వే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ఇది తన కెరీర్‌లో చాలా ప్రత్యేకమని ఆయనే ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. హీరోయిన్ శ్రీలీల ధమాకా' తర్వాత ఈ జోడీకి ఇది రెండో సినిమా. దర్శకుడు భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా మారుతున్నారు.
భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ మూవీకి నిర్మాతలు సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఈ నెల 31 న థియేటర్లలో విడుదల కానుంది.