మణిపూర్‌లో పెళ్లి చేసుకుంటే ఇలా ఉంటుంది - రణదీప్‌ హుడా చెప్పిన రహస్యం

This is what happens when you get married in Manipur - Randeep Hooda's secret

Update: 2025-06-24 08:02 GMT



మణిపూర్‌ అమ్మాయిలను పెళ్లి చేసుకోవాలంటే అక్కడి సంప్రదాయాలన్నీ అనుభవం అవుతాయని బాలీవుడ్‌ నటుడు రణదీప్‌ హుడా వెల్లడించారు. తన పెళ్లిలో అక్కడి పూజారి ఓ బౌల్‌ ఇచ్చారని, మూత్రం వస్తే అందులో పట్టుకోవడానికని తర్వాత తనకు తెలిసిందన్నారు.

రణదీప్ హుడా ఇటీవల మణిపూర్‌లో నటి లిన్ లైశ్రాను సంప్రదాయ మైతేయి రీతిలో పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలో ఎదురైన అనుభవాన్ని బహిరంగంగా వివరించాడు. 2023లో జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన కొన్ని దృశ్యాలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ, ఇప్పుడు రణదీప్ ఆ దృశ్యాల వెనుక జరిగిన వాస్తవాలేంటో బయటపెట్టారు.

ఒక ఇంటర్వ్యూలో రణదీప్ తనకు పెళ్లిలో ఎదురైన సాంస్కృతిక వైవిధ్యాల గురించి సరదాగా వివరించాడు. ముఖ్యంగా ఒక విషయం.. అంటే మూత్ర విసర్జనకు అవసరమైనపుడు ఉపయోగించేందుకు ఒక బౌల్‌ను ఇచ్చిన దానిపై ఆసక్తికరంగా వెల్లడించారు. "ఆ రీతులు చాలా గంభీరంగా ఉన్నాయి," అని రణదీప్ చెప్పారు. "వరుడిగా నేను ప్రతి అడుగూ ఖచ్చితంగా అనుసరించాల్సి వచ్చింది. నాకు ఒక సహాయకుడు వెంట ఉండేవాడు. ఆయన నాకు ప్రతి స్టెప్‌లో దారిచూపేవారు." అని గుర్తు చేసుకున్నారు.

పెళ్లి సంప్రదాయంలో భాగంగా ఒక ప్రత్యేక రీతిని గురించి చెబుతూ రణదీప్ ఇలా అన్నారు: "ఒకసారి తలపై పూజా వస్తువు పెట్టాక, దాన్ని వంచకూడదు. అప్పుడు వారు ఒక బౌల్, ఒక గొడుగు ఇచ్చి, నన్ను ఒక ఓ నిర్దిష్ట ప్రదేశంలో కూర్చోబెట్టారు. అందరూ వచ్చి నన్ను చూస్తున్నారు. అయినా.. నేను కదలకుండా అక్కడే కూర్చోవాలి. అని చెబుతూ.. "మండపంలో సంప్రదాయ పద్దతులు జరుగుతుండగా, వారు నన్ను ఒక దుప్పటితో కప్పేశారు. ‘ఇప్పుడు కదలకూడదు’ అని ఆదేశించాఉ. దాదాపు రెండు గంటల పాటు నేను కదలకుండా అలాగే కూర్చొని ఉండాలి. తల నేరుగా ఉంచాలి. అప్పుడు నేను అడిగాను – ఈ బౌల్ ఏంటి అని. అప్పుడు సహాయకుడు ‘నువ్వు మూత్రం పెట్టాలంటే ఇది ఉపయోగించు. గొడుగు తెరిచి చేసేయి. నువ్విప్పుడు దేవుడివి, లేవకూడదు." అని సాదాసీదాగా బదులిచ్చాడు.

ఈ వినూత్న అనుభవం అంతా మణిపూర్‌లో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో జరిగింది. మణిపూర్లో నెలకొన్న ఆ పరిస్థితుల మధ్య పెళ్లి చేయడం అసాధ్యంగా అనిపించిందని, కానీ.. తన మిత్రుడు అస్సాం రైఫిల్స్‌లో బ్రిగేడియర్‌గా పనిచేస్తోన్న సంగ్వాన్ సహకారంతో పెళ్లి జరిగిందన్నారు రణదీప్‌ హుడా. "అక్కడ అప్పటికి కాస్త అంతర్గత యుద్ధంలాంటిదే నడుస్తోంది," అని ఆయన వివరించారు.

Tags:    

Similar News