Sankranti Movies 2026: 2026 సంక్రాంతి బరిలో ఈ మూడు సినిమాలు ఫిక్స్
ఈ మూడు సినిమాలు ఫిక్స్
Sankranti Movies 2026: 2026 సంక్రాంతికి టాలీవుడ్‌లో బాక్సాఫీస్ వద్ద రసవత్తరమైన పోరు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం అధికారికంగా లేదా గట్టిగా రేసులో ఉన్నట్లు ప్రకటించిన ప్రముఖ సినిమాలు మూడు ఉన్నాయి:
ప్రభాస్, నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ హీరోహీరోయిన్లుగా మారుతి డైరెక్షన్ లో వస్తోన్న చిత్రం- 'ది రాజా సాబ్' (The Raja Saab). ఈ సినిమాను జనవరి 9వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇది ఒక హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ అని తెలుస్తోంది.
చిరంజీవి - 'మన శంకరవరప్రసాద్ గారు' చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంది, నయనతార హీరోయిన్ గా నటిస్తో్న్న ఈ సినిమాను... దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నాడు. సంక్రాంతి కానుకగా సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇంకా డేట్ ఫిక్స్ కాలేదు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌గా ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తూ వస్తుంది ఈ చిత్రం.
ఇక నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి హీరోహీరోయిన్లుగా దర్శకుడు కల్యాణ్ శంకర్ తెరకెక్కిస్తు్న్న చిత్రం - 'అనగనగా ఒక రాజు'. గోదావరి ప్రాంతంలో జరిగే సరదా గ్రామీణ నేపథ్య కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం రూపొందుతుంది. జనవరి 14వ తేదీన ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఈ మూడు సినిమాలతో పాటు, మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఆ సమయంలో విడుదలయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాల్లో చర్చ నడుస్తోంది రవితేజ - కిషోర్ తిరుమల సినిమా (RT76) చిత్రం కూడా సంక్రాంతికి రావడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి.తమిళ స్టార్ విజయ్ యొక్క చివరి సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా సంక్రాంతి రేసులో ఉండవచ్చని తెలుస్తోంది.