Tollywood Love Birds: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు టాలీవుడ్ లవ్ బర్డ్స్
విదేశాలకు టాలీవుడ్ లవ్ బర్డ్స్
Tollywood Love Birds: ఇటీవలే ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విజయ్ దేవరకొండ - రష్మిక మందన్న.. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ నూతన సంవత్సర వేడుకల కోసం సిద్ధమయ్యారు. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఈ జోడీ క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల కోసం కాస్త విరామం తీసుకున్నారు. హైదరాబాద్ విమానాశ్రయంలో విజయ్, రష్మిక విడివిడిగా కనిపించినప్పటికీ, వీరిద్దరూ ఒకే డెస్టినేషన్‌కు వెళ్తున్నట్లు సమాచారం.
రష్మిక తన వెకేషన్ ట్రిప్‌కు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. ఇటీవల రష్మికను పెళ్లి గురించి అడగ్గా, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెబుతానని, అప్పటివరకు వేచి చూడాలని చెప్పింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ రౌడీ జనార్ధన సినిమాతో బిజీగా ఉన్నారు. రష్మిక మందన్న ది గర్ల్‌ఫ్రెండ్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం మైసా చిత్రంలో నటిస్తున్నారు. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వెండితెరపై ఈ జంట మ్యాజిక్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.