Tragedy in the Film Industry: సినీ ఇండస్ట్రీలో విషాదం..ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

ప్రముఖ డైరెక్టర్ కన్నుమూత

Update: 2025-12-20 09:20 GMT

Tragedy in the Film Industry: మలయాళ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ నటుడు, దర్శకుడు , స్క్రీన్ ప్లే రచయిత శ్రీనివాసన్ (69) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ ఉదయం కొచ్చిలోని త్రిప్పుణితురలో ఉన్న ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఏప్రిల్ 6, 1956న కేరళలోని కన్నూర్ జిల్లాలో జన్మించారు. 1976లో 'మణిముజక్కం' సినిమాతో నటుడిగా పరిచయమయ్యారు. సుమారు 5 దశాబ్దాల కెరీర్‌లో 225కు పైగా సినిమాల్లో నటించారు.

ఆయన కేవలం నటుడిగానే కాకుండా 50కి పైగా సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే అందించారు. కొన్ని అద్భుతమైన సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. సామాజిక అంశాలను హాస్యంతో మేళవించి చెప్పడంలో ఆయన దిట్ట. ఆయన దర్శకత్వం వహించిన 'చింతవిష్టయాయ శ్యామల' సినిమాకు జాతీయ అవార్డు లభించింది. ఆయనకు భార్య విమల, ఇద్దరు కుమారులు వినీత్ శ్రీనివాసన్, ధ్యాన్ శ్రీనివాసన్ ఉన్నారు. వీరిద్దరూ కూడా మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటులుగా, దర్శకులుగా కొనసాగుతున్నారు.

ఆయన మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మలయాళ సినిమా ఒక గొప్ప మేధావిని, సామాజిక స్పృహ ఉన్న కళాకారుడిని కోల్పోయిందన్నారు.

Tags:    

Similar News