Actress Radhika: నటి రాధిక ఇంట్లో తీవ్ర విషాదం
తీవ్ర విషాదం
Actress Radhika: నటి రాధికా శరత్ కుమార్ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి గీత కన్నుమూశారు. ఈ విషయాన్ని రాధిక స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చెన్నైలోని తన నివాసంలో సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 88 సంవత్సరాలు.రాధికా శరత్ కుమార్, ఆమె సోదరుడు రాధా రవి, మరియు ఇతర కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆమె మరణం పట్ల సినీ ప్రముఖులు, అభిమానులు సంతాపం తెలియజేస్తున్నారు. గీతగారి అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నట్లు కుటుంబ వర్గాలు తెలిపాయి. రాధిక తండ్రి ప్రముఖ తమిళ నటుడు, హాస్య నటుడు ఎం.ఆర్. రాధా. ఆయనకు ఐదుగురు భార్యలు, 12 మంది పిల్లలు ఉన్నారు. ఆమె తల్లి పేరు గీత, శ్రీలంకకు చెందినవారు. రాధిక, ఆమె చెల్లెలు నిరోషా (ఈమె కూడా నటి) గీతకు జన్మించారు. రాధిక మూడుసార్లు వివాహం చేసుకున్నారు. మొదటి వివాహం మలయాళ నటుడు మరియు దర్శకుడు ప్రతాప్ పోతేన్తో 1985లో జరిగింది. రెండవ వివాహం 1990లో బ్రిటీష్ జాతీయుడైన రిచర్డ్ హార్డీతో జరిగింది. ఈ వివాహం ద్వారా వారికి రయాన్నే హార్డీ అనే కుమార్తె జన్మించింది.మూడవ వివాహం నటుడు, రాజకీయ నాయకుడు శరత్ కుమార్తో 2001లో జరిగింది. వారికి రాహుల్ అనే కుమారుడు జన్మించాడు. శరత్ కుమార్ మొదటి భార్య ఛాయాకు జన్మించిన కుమార్తె వరలక్ష్మి శరత్ కుమార్ కూడా ప్రముఖ నటి. రాధిక మరియు శరత్ కుమార్ ఇద్దరూ వారి పిల్లలందరితో కలిసి సంతోషంగా ఉంటారు.