Trending News

Triple Treat for Prabhas Fans on His Birthday: బర్త్ డే రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్

ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్

Update: 2025-10-16 11:26 GMT

Triple Treat for Prabhas Fans on His Birthday: డార్లింగ్ హీరో ప్రభాస్ బర్త్ డే పుట్టిన రోజు ఈ నెల 23న ట్రిపుల్ ట్రీట్ ఉండనుంది. ప్రస్తుతం ఆయన 'ది రాజా సాల్' సినిమా షూటింగ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమా చివరి దశలో ఉంది. ప్రస్తుతం గ్రీస్లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. సంక్రాంతి స్పెషల్గా జనవరి 9న సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తు న్నారు. దీంతో పుట్టినరోజు సందర్భంగా 'ది రాజా సాబ్' మొదటి సింగిల్ ను రిలీజ్ చేయాలని టీమ్ నిర్ద యించింది. ఈ పాటలో ప్రభాస్ లుక్, స్టైల్ను గ్రాండ్ చూపించబోతున్నారని సమాచారం.

ఇక రెండో సర్ ప్రైజ్ విషయానికి వస్తే.. హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్న కొత్త 'సినిమా'' గురించి టీజర్ అప్డేట్ రానుంది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఫ్రీజ్ &మెటిలో హను స్వయంగా ఈ విషయాన్ని దృవీకరించారు పుట్టిన రోజున డౌజ్ టైటిల్ రివీల్ వీడియోను రిలీజ్ చేయనున్నారు.

మూడో సర్ ప్రైజ్ గా ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ను స్టార్ గా నిలబెట్టిన సినిమా 'బాహుబలి' మళ్లీ పెద్ద తెర పైకి రాబోతోంది. రెండు భాగాలు కలిసి చేసిన దీ ఏడిట్ వెర్షన్ బాహుబలి ది ఎపిక్ అక్టోబర్ 31 న ప్రీమియం ఫార్మాట్లలో విడుదల కానుంది. దీని ట్రైలర్ ను ప్రభాస్ పుట్టిన రోజున రిలీజ్ చేయాలని మేకర్స్ సిర్ణయించారు అంటే ఈ సారి ప్రభాస్ ఫ్యాన్స్ కు ట్రిపుల్ ట్రీట్ అన్నట్టే.

Tags:    

Similar News