Trisha’s Marriage: త్రిష పెళ్లి ఫిక్స్ అయ్యిందా..? 42 ఏళ్ల బ్యూటీకి ఆ వ్యాపారవేత్తతోనే ఏడడుగులా..?

42 ఏళ్ల బ్యూటీకి ఆ వ్యాపారవేత్తతోనే ఏడడుగులా..?

Update: 2025-10-10 13:17 GMT

Trisha’s Marriage: సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న త్రిష త్వరలో పెళ్లి చేసుకోబోతోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఈసారి ఈ రూమర్స్‌లో నిజం ఉందనే సంకేతాలు గట్టిగా వినిపిస్తున్నాయి. 42 ఏళ్లు వచ్చినా కూడా టీనేజ్ అమ్మాయిలాగే కనిపించే త్రిష, సినిమాలకు దూరం కావడం లేదు. అయినా కూడా పెళ్లి వయసు దాటిపోతుండటంతో కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కోలీవుడ్ మీడియాలో చర్చ నడుస్తోంది.

చండీగఢ్ బిజినెస్‌మ్యాన్‌తో ఏడడుగులు!

త్రిష ఒక చండీగఢ్ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. ఇరు కుటుంబాల వారు కూడా ఈ పెళ్లికి ఓకే చెప్పారట. ఆ వ్యాపారవేత్త గురించి పూర్తి వివరాలు బయటకు రాకపోయినా రెండు కుటుంబాల మధ్య చాలా ఏళ్లుగా పరిచయం ఉందని తెలుస్తోంది. 2015లో వరుణ్ మణియన్ అనే బిజినెస్‌మ్యాన్‌తో త్రిషకు నిశ్చితార్థం జరిగింది. కానీ కొన్ని కారణాల వల్ల ఆ పెళ్లి ఆగిపోయింది.

ఇప్పుడు మళ్లీ పెళ్లి వార్తలు రావడం, అందులోనూ కోలీవుడ్ మీడియా బలంగా చెబుతుండడంతో, ఈసారి త్రిష నిజంగానే పెళ్లి బంధంలోకి అడుగుపెట్టే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు త్రిష ప్రస్తుతం చిరంజీవితో విశ్వంభర వంటి పెద్ద సినిమాతో బిజీగా ఉంది.

Tags:    

Similar News